ఆంధ్రప్రదేశ్‌

షార్‌లో రెడ్ అలర్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట: దేశంలో ఉగ్రవాదుల కదలికలు ఉన్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించడంతో ముందుజాగ్రత్త చర్యలో భాగంగా ఆదివారం షార్‌లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. దేశంలోకి 10 మందికి పైగా ఉగ్రవాదులు చొరబడ్డారని, ఏ క్షణంలోనైన దాడులు చేయవచ్చునని ఐబి హెచ్ఛరికలు జారీ చేసినే నేపథ్యంలో అన్ని ప్రధాన నగరాల్లో కేంద్ర భద్రతా దళాలు రంగంలోకి దిగాయి. దీంతో షార్‌కు కూడా ముప్పు పొంచి ఉందని ఇంటెలిజెన్స్ బ్యూరో చెప్పడంతో షార్ పరిసరాలతో పాటు సముద్ర మార్గాన భద్రతను కట్టుదిట్టం చేశారు. అదేవిధంగా షార్‌లోకి వెళ్లే మొదటి, రెండో ప్రధాన గేట్ల వద్ద కూడా సిఐఎస్‌ఎఫ్ సిబ్బంది లోపలకు వెళ్లే వాహనాలతో పాటు వ్యక్తులను కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసి పంపుతున్నారు. ఈనెల 10న పిఎస్‌ఎల్‌వి-సి 32 ప్రయోగంతో పాటు ఉగ్రవాదుల కదలికలు ఉండడంతో సిఐఎస్‌ఎఫ్ సిబ్బంది నిఘా పెంచి భద్రతను కట్టుదిట్టం చేశారు.