ఆంధ్రప్రదేశ్‌

వరప్రదాయిని ‘ఉపాధిహామీ’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 22: దేశంలో ఎన్ని చట్టాలు వచ్చినప్పటికీ సమాచార హక్కు, ఉపాధి హామీ చట్టాలు పేద ప్రజలకు వరప్రదాయినులని, ఈ రెండు చట్టాలు చాలా కచ్చితంగా అమలవుతున్నాయని, ఉపాధి హామీ పథకం అమలులో అసిస్టెంట్ ప్రోగ్రాం డైరెక్టర్లది కీలకపాత్ర అని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ బి.రామాంజనేయులు అన్నారు. శుక్రవారం విజయవాడలో జరిగిన గ్రామీణాభివృద్ధి శాఖ అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ల సమావేశంలో ఆ శాఖ చేపడుతున్న వివిధ కార్యక్రమాలను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పథకానికి సంబంధించి ఎన్నో విజయాలను సాధిస్తున్నప్పటికీ కొన్ని లోపాల వల్ల సమస్యలను ఎదుర్కోవలసి వస్తోందని, ఆ లోపాలను సరిదిద్దుకున్నట్టయితే ఈ పథకం అమలులో రాష్ట్రానికి తిరుగుండదన్నారు. ప్రతి పనికి సంబంధించిన ఫైల్ ఏర్పాటు, పని ప్రదేశంలో సమాచార బోర్డులు, జాబ్ కార్డుల అప్‌డేషన్, 7 రిజిష్టర్ల నిర్వహణ వంటి అంశాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుని క్లస్టర్ ఎపిడిలు పనిచేయాలన్నారు. సకాలంలో కేంద్ర నిధులు రాకపోయినప్పటికీ నిధుల కొరత లేకుండా గణనీయమైన విజయాలను సాధిస్తోందన్నారు. 11వేల కిమీ సిమెంట్ రోడ్లు, అంగన్‌వాడీ కేంద్రాలు, గ్రామ పంచాయతీ మండల భవనాల నిర్మాణం, శ్మశానాల అభివృద్ధి వంటి పనులను గణనీయంగా చేపట్టామని రామాంజనేయులు అన్నారు. పనికి దరఖాస్తు, పనుల గుర్తింపు, సాంకేతిక పరిపాలనా ఆమోదాలు, ఎం బుక్ నిర్వహణ తదితర ప్రక్రియల నిర్వహణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని అంటూ, ఈ అంశాలన్నింటిని ఎపిడిలు స్వయంగా పర్యవేక్షించినప్పుడే పథకం సక్రమంగా నడుస్తుందని చెప్పారు. అక్టోబర్ నెల నుంచి కమిషనర్ కార్యాలయం అధికారులు వచ్చి ఎంచుకున్న గ్రామ పంచాయతీల్లో ఆకస్మిక పర్యటనలు చేయనున్నారని చెప్పారు. జాయింట్ కమిషనర్లు జి.బాలసుబ్రమణ్యం, కె.వరప్రసాద్‌లు ఉపాధి హామీ, ఎన్‌టిఆర్ జలసిరి అంశాలను ఎపిడిలతో సమీక్షించారు. ఈ సమావేశంలో ఇజిఎస్ డిప్యూటీ కమిషనర్లు, 13 జిల్లాల ఎపిడిలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.