ఆంధ్రప్రదేశ్‌

మానవ అక్రమ రవాణాకు అడ్డుకట్ట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 23: మానవ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడం ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థల సమష్టి కృషితోనే సాధ్యమని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్ పేర్కొన్నారు. హెల్ప్, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ టెర్రిడెస్ హోమ్స్, నెదర్లాండ్స్ సహాయంతో మానవ అక్రమ రవాణా బాధితుల పునరావాసం, ఇతర సేవల బలోపేతంపై స్థానికంగా ఒక హోటల్‌లో శనివారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి వర్క్‌షాపులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా.. ముఖ్యంగా వ్యాపార లైంగిక దోపిడీకై మహిళల, బాలికల అక్రమ రవాణా చాపకింద నీరులా వ్యాపిస్తోందని, ఎంతోమంది అమాయకులైన బాలికలు ఈ విషవలయంలో చిక్కుకుని తమ బాల్యాన్ని, బాలల హక్కులను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌లో మానవ అక్రమ రవాణా బాధితులకై ప్రత్యేక స్టేట్ హోమ్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం త్వరలోనే చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇలాంటి సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలు, వర్క్‌షాపులు మరిన్ని జరగాలని, అందుకు కృషి చేస్తున్న హెల్ప్ సంస్థను అభినందించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ డెప్యూటీ డైరెక్టర్ రామకోటేశ్వరరావు మాట్లాడుతూ మహిళలు, బాలల అక్రమ రవాణా ఒక వ్యవస్థీకృత నేరమని, దీని నిరోధంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ పాత్ర కీలకం అన్నారు.
ట్రాఫికర్లకు శిక్షలు పడటంలో పోలీస్, న్యాయ వ్యవస్థ సమన్వయంతో పనిచేయడం ముఖ్యమైన అంశమని అన్నారు. మానవ అక్రమ రవాణా నిరోధానికి అందరూ కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. యూనిసెఫ్ చైల్డ్ ప్రొటెక్షన్ ప్రోగ్రాం మేనేజర్ పి.డేవిడ్ రాజు మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా బాధితులకు అందించాల్సిన పునరావాస, నష్టపరిహార సేవల్లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థలకున్న అధికారాలను ఉపయోగించి, బాధితులకు వీలైనంత త్వరగా సదరు సేవలు అందేలా చూడాలన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కృష్ణా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్డి రాజీవ్ మాట్లాడుతూ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మానవ అక్రమ రవాణా బాధితుల పునరావాసం, ఇతర సహాయ సేవలకు సంబంధించిన అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. హెల్ప్ స్వచ్ఛంద సంస్థ సెక్రటరీ ఎన్‌విఎస్ రామ్మోహన్ మాట్లాడుతూ మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కమిషనర్ అరుణ్‌కుమార్ మహిళలు, బాలల అక్రమ రవాణాపై వారికి అందాల్సిన పునరావాస, ఇతర సహాయ సేవలపై ప్రత్యేక దృష్టి సారించి, తమవంటి స్వచ్ఛంద సంస్థల సేవలను పొందుతూ చక్కగా కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల నుండి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థల కార్యదర్శులు, మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్, బాలల రక్షణ అధికారులు, స్పెషల్ జువైనల్ పోలీస్ యూనిట్ ఎఎస్‌పిలు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సిఐడి అధికారులు పాల్గొన్నారు.