ఆంధ్రప్రదేశ్‌

చంద్రబాబుది అట్టర్ ఫ్లాప్ ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 23: చంద్రబాబు ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని, ఇదొక అట్టర్ ప్లాఫ్ ప్రభుత్వమని, రాష్ట్రంలో పాలన పడకేసిందంటూ పిసిసి అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ తులసిరెడ్డి ధ్వజమెత్తారు. దోమలు, సైకోలు, మాఫియాలు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాయని శనివారం ఒక ప్రకటనలో ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ, ఇతర ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలు అక్షర సత్యాలని ఇటీవల జరుగుతున్న ఉదంతాలు స్పష్టం చేస్తున్నాయని అన్నారు. రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా అమలుచేయడంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందినదన్నారు. రాయలసీమకు, ఉత్తరాంధ్రకు కేంద్రం నుంచి ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ నిధులు తెప్పించటంలో ప్రభుత్వం విఫలమయిందన్నారు. రాష్ట్రానికి వరప్రసాదిని అయిన పోలవరానికి, రాజధానికి కేంద్రం నుంచి నిధులు తెప్పించడంలోనూ విఫలమయ్యారన్నారు. కడప జిల్లాకు ఉక్కు కర్మాగారం, దుగరాజపట్నం ఓడరేవు, విశాఖపట్నం కొత్త రైల్వే జోన్ మంజూరు చేయించడంలో కూడా ఘోర వైఫల్యం చెందారని అన్నారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో తొలిసారి విఫలమయ్యానని తెలుగుదేశం ఎంపి జెసి దివాకర్‌రెడ్డి అన్న మాటలు ఇందుకు ప్రబల నిదర్శనమన్నారు. చివరకు తాను విఫలమైన సిఎంనని కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబే చెప్పారని అన్నారు. ఇటువంటి అట్టర్ ప్లాఫ్ ప్రభుత్వం మనకు అవసరమా అనేది ఆలోచించవలసిందిగా ప్రజలకు తులసిరెడ్డి విజ్ఞప్తి చేశారు.