ఆంధ్రప్రదేశ్‌

గంజాయి స్మగ్లింగ్ నియంత్రణే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 23: గంజాయి సాగు, స్మగ్లింగ్ నియంత్రణే లక్ష్యంగా పోలీసు, ఎక్సైజ్ సహా పలు శాఖలు పనిచేస్తాయని ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ కె వెంకటేశ్వర రావు వెల్లడించారు. ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాల ఎక్సైజ్ అధికారులకు ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని విశాఖలో శనివారం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్ని శాఖల సమన్వయంతో టాస్క్ఫోర్స్ గంజాయి సాగుపై కఠిన వైఖరి అవలంబిస్తుందన్నారు. గంజాయి సాగు, అక్రమ రవాణా నియంత్రణలో భాగంగా రెవెన్యూ, ఆర్టీసీ తదితర శాఖలతో కలిసి పనిచేస్తామన్నారు.
గంజాయి రవాణా నియంత్రణలో భాగంగా అనకాపల్లి కేంద్రంగా టాస్క్ఫోర్స్ పోలీసు స్టేషన్ ప్రారంభించామన్నారు. ఎక్సైజ్,పోలీసు సహా ఇతర శాఖల అధికారులు సమన్వయంతో గంజాయి సాగు, రవాణా నియంత్రణలో భాగస్వామ్యం అవుతారన్నారు. ఏజెన్సీలో గంజాయి సాగులో అమాయక గిరిజనులను ఉపయోగించుకుంటున్నారని, గిరిజనులకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు గంజాయి సాగువల్ల కలిగే అనర్థాలు, పట్టుబడితే కఠిన శిక్షలకు గురికావాల్సి వస్తుందన్న వాస్తవాన్ని వారికి వివరిస్తామన్నారు. అధికారుల శిక్షణ కార్యక్రమాన్ని డిఐజి శ్రీకాంత్ ప్రారంభించగా, నగర జెసిపి నాగేంద్ర కుమార్, రూరల్‌ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ, ఎక్సైజ్ అధికారులు పాల్గొన్నారు.