ఆంధ్రప్రదేశ్‌

రూ. 30 వేల కోట్లతో గిరిజన ప్రాంతాల అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 23: దేశవ్యాప్తంగా గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నట్టు కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి జోల్ ఆరం ప్రకటించారు. గీత సొసైటీ ఆధ్వర్యంలో విశాఖ నగరంలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గిరిజనుల సంక్షేమం, ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ట్రైబర్ డెవలప్‌మెంట్ కమిషన్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కేంద్రం ఆలోచనగా పేర్కొన్నారు. ఈ అంశంపై ఇప్పటికే తాను ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించానన్నారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించి ఒక నిర్ణయానికి వస్తామన్నారు. గిరిజన సంక్షేమం కోసం ప్రతి రాష్ట్రానికి కేంద్రం రూ.500 కోట్ల నిధులు మంజూరు చేస్తోందన్నారు. టివిలు, సినిమాలు గిరిజన తెగలపై విపరీతమైన ప్రభావాన్ని చూపుతున్నాయన్నారు. వీటి ప్రభావం వల్ల గిరిజనులు తమ సంప్రదాయాలను, కట్టుబాట్లను విస్మరిస్తున్నారన్నారు. ఇదే కొనసాగితే గిరిజన సంస్కృతి కనుమరుగవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గిరిజనుల సంక్షేమం కోసం తొలి సారిగా ప్రధానిగా వాజ్‌పాయ్ ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖను ఏర్పాటు చేసిందన్నారు. అప్పటి వాజపేయి కేబినెట్‌లో తాను గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశానన్నారు. తిరిగి నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత గిరిజన సంక్షేమ శాఖ బాధ్యతలు తనకే అప్పగించారన్నారు. గిరిజనులకు ఎటువంటి సమస్య తలెత్తినా తనను సంప్రదించవచ్చన్నారు. ఎంపి హరిబాబు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాతే దేశంలో గిరిజనులకు కనీస సదుపాయాలు కల్పించేందుకు నిధులు మంజూరవుతున్నాయన్నారు. ఎంపి కొత్తపల్లి గీత మాట్లాడుతూ గిరిజనులకు సురక్షిత మంచి నీటి సదుపాయం కల్పించేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి.

చిత్రం..సమావేశంలో మాట్లాడుతున్న కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి జోల్ ఆరం