ఆంధ్రప్రదేశ్‌

నెల్లూరులో చిక్కిన ట్రాన్స్‌కో ఉద్యోగి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, సెప్టెంబర్ 24: నగరంలోని ఓ బార్‌లో రూ. 10 వేలు లంచం తీసుకుంటుండగా ట్రాన్స్‌కో ఉద్యోగి దువ్వూరు ధనుంజయను నెల్లూరు ఎసిబి డిఎస్‌పి పరమేశ్వరరెడ్డి నేతృత్వంలో ఎసిబి సిబ్బంది పట్టుకున్నారు. దువ్వూరు ధునుంజయ ఎఎస్ పేట మండలంలో ట్రాన్స్‌కో లైన్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. మండల పరిధిలోని శ్రీకొలను గ్రామానికి చెందిన నూకరాజు బలరామిరెడ్డి అనే రైతు తన పొలంలో సాగునీటి బోరు వేసుకొనేందుకు విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. రూ. 10 వేలు లంచం ఇస్తే కనెక్షన్ మంజూరు చేస్తానని లైన్ ఇన్‌స్పెక్టర్ ధనుంజయ రైతు బలరామిరెడ్డికి ఖరాఖండిగా చెప్పాడు. దీంతో రైతు నెల్లూరు ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. రైతు బలరామిరెడ్డి బార్‌లో ధనుంజయకు రూ. 10 వేలు లంచం ఇవ్వగా, అక్కడే మాటువేసిన ఎసిబి అధికారుల బృందం ధనుంజయను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.