ఆంధ్రప్రదేశ్‌

ఎసిబి వలలో పూతలపట్టు తహశీల్దార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాకాల, సెప్టెంబర్ 24: చిత్తూరు జిల్లా పూతలపట్టు తహశీల్దార్ కె.సుధాకరయ్య 2 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు చిక్కారు. ఒక కంకర క్వారీకి ఎన్‌ఓసి ఇచ్చేందుకు 2 లక్షల రూపాయలు డిమాండ్ చేసి పాకాలలోని తన ఇంట్లో తీసుకుంటుండగా ఎసిబి అధికారులు ఆదివారం దాడులు చేసి పట్టుకున్నారు. అనంతరం తహశీల్దార్ నుంచి రూ.2 లక్షల లంచం నగదును స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి ఎసిబి డిఎస్పీ శంకర్‌రెడ్డి కథనం మేరకు పూతలపట్టు తహశీల్దార్ సుధాకరయ్యకు మండలంలోని పోటుకనుమ రెవెన్యూ గ్రామ పరిధిలోని ఓ కంకర క్వారీ రెన్యువల్ ఎన్‌ఓసి తీసుకునేందుకు గత కొద్దిరోజుల క్రితం కంకర క్వారీ మేనేజర్ మధుసూదన్‌రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. అయితే మొదటగా రూ.2లక్షలు తీసుకున్న తహశీల్దార్ తిరిగి రూ.2లక్షలు ఇస్తేనే ఎన్‌ఓసి ఇస్తానని చెప్పడంతో కంకర క్వారీ మేనేజర్ తిరుపతి ఎసిబి అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. ఈమేరకు ఆదివారం ఉదయం తన ఇంటి వద్దే రూ.2 లక్షల లంచం నగదును తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం ఇంట్లో తనిఖీలు చేయగా దాదాపు రూ.15 కోట్ల మేర ఆస్తుల దస్తావేజులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. తిరుపతి, చిత్తూరు, హైదరాబాద్, బెంగళూరులలో ప్లాట్లు, భూములు, అపార్ట్‌మెంట్ల డాక్యుమెంట్లను ఈసందర్భంగా ఎసిబి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 5 గంటలపాటు సుధాకరయ్యను ఆయన ఇంట్లోనే విచారించారు. అనంతరం పూతలపట్టు తహశీల్దార్ కార్యాలయానికి తీసుకెళ్లి రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. అక్కడ తహశీల్దార్ పర్సనల్ బీరువాను తనఖీ చేయగా, దానిలో దొరికిన డైరీలో అతని బినామీల వివరాలు పూర్తిగా బయటపడినట్లు తెలిసింది. ఇందులో పాకాల మండలం అధికార పార్టీ నేతల పేర్లు అధికంగా ఉండటంతో ఎసిబి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. కాగా తహశీల్దార్‌గా పదోన్నతి వచ్చినప్పటి నుంచి రొంపిచర్ల, పాకాల, పూతలపట్టు మండలాల్లో పనిచేశారు. పూతలపట్టులో రికార్డులు స్వాధీనం చేసుకోగా పాకాలలో పనిచేసిన ఏడాదిన్నర కాలంలో ఇతనిపై పలు ఆరోపణలు ఉండటంతో పాకాలలోని కార్యాలయ రికార్డులు కూడా ఎసిబి అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. సుధాకరయ్యపై ఎసిబి అధికారులు దాడులు చేపడుతుండగానే పలువురు ఎసిబి డిఎస్పీకి ఫోన్ ద్వారా అవినీతి చిట్టాను వివరించినట్లు సమాచారం. సుధాకరయ్యను నెల్లూరు ఎసిబి కోర్టులో హాజరుపరచనున్నట్లు ఎసిబి డిఎస్పీ శంకర్‌రెడ్డి విలేఖరులకు తెలిపారు. దాడుల్లో సిఐలు చం ద్రశేఖర్, గిరిధర్, ప్రసాద్ సిబ్బంది పాల్గొన్నారు.