ఆంధ్రప్రదేశ్‌

హద్దులు మీరుతున్న ప్రతిపక్ష నేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 24: ప్రజల దాహార్తి తీరుస్తున్న ముఖ్యమంత్రిని నీటి దొంగ అనడం ప్రతిపక్ష నాయకుడి దిగజారుడుతనానికి నిదర్శనమని ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి కెఇ కృష్ణమూర్తి అన్నారు. పార్టీల మధ్య సిద్ధాంతపరంగా విభేదాలు ఉండవచ్చుకానీ వ్యక్తుల మధ్య ఉండకూడదని, ప్రతిపక్ష నాయకుడు హద్దులు మీరుతున్నారని ఆదివారం ఇక్కడో ప్రకటనలో విమర్శించారు. కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని కాపాడుకోవడం రాష్ట్రంలోని ప్రతి పౌరుడి ప్రాథమిక బాధ్యత అని, కానీ తెలుగు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రతిపక్ష నాయకుడు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. పోతిరెడ్డిపాడు నుంచి నీటి విడుదల విషయమై తెలంగాణ రాష్ట్రంలో విషప్రచారం చేస్తున్నారని, రాయలసీమ ప్రజలు సాగు, తాగునీరు అందక అల్లాడుతుంటే జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నాడంటూ వ్యాఖ్యానించారు. రాయలసీమపై ఎందుకు విషం కక్కుతున్నారని నిలదీశారు. పోతిరెడ్డిపాడు నుంచి రైతులకు సాగు, తాగునీరు అందిస్తుంటే ముఖ్యమంత్రి దొంగతనం చేస్తున్నాడనడంలో అర్థమేమిటని ప్రశ్నించారు. తీరు మార్చుకోకుంటే వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా గల్లంతవుతాయని కెఇ హెచ్చరించారు. ఒకవైపు కడపలో నీళ్ల కోసం ఎమ్మెల్యేలతో దీక్షలు చేయిస్తూ, మరోవైపు తప్పుడు ప్రచారం చేస్తుంటే నమ్మడానికి ప్రజలు పిచ్చివాళ్లు కాదన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వానికి సహకరించకపోయినా పరవాలేదు కానీ, రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీయవద్దని ఉప ముఖ్యమంత్రి కెఇ హితవు పలికారు.