ఆంధ్రప్రదేశ్‌

భాషాభివృద్ధిపై హామీ నిలబెట్టుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: తెలుగు భాషాభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను అమలుచేయడంలో విఫలమయ్యారని డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆరోపించారు. ఆదివారం ఆంధ్రభవన్‌లో విలేఖరులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో ఒకటవ తరగతి నుంచి ఇంటర్ వరకు కచ్చితంగా తెలుగును ఒక సబ్జెక్ట్‌గా అమలు చేస్తామని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని అమలు చేయడం లేదని అన్నారు. ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని చెప్పారు. తెలుగు భాషాభివృద్ధి విషయంలో తెలంగాణను ఆదర్శంగా తీసుకుని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో వివిధ అభివృద్థి పనులు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల సందర్భంగా వేసే శిలాఫలకాలు తెలుగులోనే వేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీని అధికారులు పట్టించుకోవడం లేదని, ఆంగ్లంలోనే శిలాఫలకాలు వేస్తున్నారని అధికారుల తీరును ఆయన తప్పుబట్టారు. గోదావరి పుష్కరాల సమయంలో రాజమండ్రిలో తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి నిలబెట్టుకోవాలని అన్నారు. తెలుగు భాషకు అన్యాయం చేసి చరిత్రహీనులు కావద్దని, తెలుగు భాషాభివృద్ధికి కెసిఆర్‌ను ఆదర్శంగా తీసుకోవాలని చంద్రబాబుకి ఆయన సూచించారు. గతంలో తెలుగు భాషాభివృద్ధికి ఒక కమిటీ వేశారని, తక్షణమే అ కమిటీ రిపోర్టు అమలుకు కృషి చేయాలని ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు.