ఆంధ్రప్రదేశ్‌

అన్నపూర్ణే.. సదాపూర్ణే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 24: అన్నం పరబ్రహ్మ స్వరూపం. సర్వజీవులకు ప్రాణాధారం. సృష్టిలోని ప్రాణులకు అన్నప్రసాదాలు అందించే నిత్యాన్నదానేశ్వరిగా పూజలందుకునే మాత కాశీ అన్నపూర్ణేశ్వరి. శరన్నవరాత్రి ఉత్సవాల్లో నాలుగోరోజైన ఆశ్వయుజ శుద్ధ చవితి ఆదివారం నాడు బెజవాడ కనకదుర్గమ్మ శ్రీ అన్నపూర్ణాదేవిగా భక్తులకు దివ్య దర్శనమిచ్చింది. అన్నపూర్ణాదేవి నిజనివాసం కాశీపురం. కాశీవిశే్వశ్వరుని ప్రియసఖి. అన్నపూర్ణాదేవిని కాశీపురాధీశ్వరిగా కొలుస్తాం. సాక్షాత్తూ పరమేశ్వరుడే ఆదిభిక్షవుగా రాగా ఆయన ఆకలి తీర్చేందుకు అన్నపూర్ణగా మారిన అమ్మ అక్షయపాత్రతో భిక్ష ప్రసాదించిన కరుణామూర్తిగా వినుతికెక్కింది. జగాలనేలే జనని చిరునగవుతో అన్నపాత్రతో ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మగా దర్శనమివ్వటంతో భక్తులు భక్తిపారవశ్యాలతో దర్శించుకున్నారు. అన్నపూర్ణాదేవి అలంకారంలో దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచే క్యూలైన్లలో బారులుతీరారు. ఆదివారం సెలవుదినం కూడా కావటంతో భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆకలితో అలమటించే అన్నార్తులను ఆదుకునేందుకు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో నిత్యాన్నదాన పథకం నిరంతరం కొనసాగుతోంది. ఇందుకు భక్తులు ఆర్థికంగా సహకరిస్తున్నారు. మరోవైపు భవానీ దీక్షా మంటపంలో ఉత్సవమూర్తులకు యథావిధిగా ప్రత్యేక కుంకుమార్చనలు జరిగాయి. యాగశాలలో రుత్విక్కులు శత చండీహోమం నిర్వహించారు. అర్చకులు శ్రీచక్రార్చన, శాంతి కల్యాణం, అష్టోత్తరం, సహస్ర నామార్చనలు నిర్వహించారు. మొత్తంపై వేదమంత్రాల ఘోష పర్వతరాజంపై ప్రతిధ్వనించి ఇంద్రకీల గిరులు నిత్యం ఓం కనకదుర్గాయనమః అనే నామస్మరణతో పులకించిపోతున్నాయి. ఆదివారం సెలవుదినం కావటంతో తెల్లవారుజామున 3 గంటలకు ముందు నుంచే భక్తులు క్యూలైన్లలో బారులుతీరారు. విద్యాసంస్థలకు దసరా సెలవులు ఇవ్వడం, ఆదివారం కూడా కలసిరావడంతో ఇంద్రకీలాద్రిపై భక్తజనం పోటెత్తారు. సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవాలయ, పోలీస్ అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. ఎంత రద్దీ ఉన్నప్పటికీ ఉచిత దర్శనం క్యూలైన్లు ఎక్కడా ఆగకుండా నిరంతరాయంగా భక్తులు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. వృద్ధులు, దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా బస్సుల ద్వారా ఉచితంగా కొండపైకి తీసుకెళ్లి ప్రత్యేక క్యూమార్గంలో దర్శనం చేయిస్తున్నారు.