ఆంధ్రప్రదేశ్‌

ప్రభుత్వ విద్యకు ప్రోత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 24: ప్రభుత్వ విద్యా సంస్థల్లో నాణ్యత ప్రమాణాలు పెంచడంతో పాటు, ప్రతిభ కలిగిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. టెన్త్‌లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ప్రతిభ పురస్కారాల కింద రూ.20వేల నగదు, ట్యాబ్‌లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని విశాఖలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆయన వెల్లడించారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యతతో కూడిన విద్యను అందిచేందుకు అవసరమైన వౌలిక సదుపాయాలు కల్పించేందుకు రూ.23,209 కోట్లను కేటాయించిందన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో ఇది 17 శాతంగా మంత్రి గంటా పేర్కొన్నారు. గతంలో ఏ ప్రభుత్వం ప్రభుత్వ విద్యకు ఇంతటి ప్రాధాన్యం ఇచ్చిన దాఖలాల్లేవన్నారు. విద్యార్థులు ఎంచుకున్న రంగంలో రాణించాలని అందుకు ఆయా రంగాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించిన వారిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
వచ్చే 2019 నాటికి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్లు, క్రీడా మైదానాలు, వంటి వౌలిక వసతులు కల్పించేందుకు ప్రాధాన్యం ఇస్తోందన్నారు. గత విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ అత్యుత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థులకు రూ.20వేల నగదు ప్రోత్సాహకంతో పాటు ట్యాబ్‌ను అందజేసేందుకు ప్రభుత్వం రూ.8.1 కోట్లను ఖర్చు చేస్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల నుంచి మండలానికి ఆరుగురు చొప్పున 4,005 మందిని ఎంపిక చేసినట్టు వెల్లడించారు. కార్యక్రమంలో మార్కటింగ్ శాఖ మంత్రి ఆదినారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.