ఆంధ్రప్రదేశ్‌

కూష్మాండ దుర్గగా భ్రమరాంబిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం, సెప్టెంబర్ 24 : దేవీ శరన్నరాత్రుల్లో భాగంగా నాల్గవ రోజైన ఆదివారం శ్రీశైల మహాక్షేత్రంలో భ్రమరాంబిక అమ్మవారు కూష్మాండదుర్గ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే సాయంత్రం శ్రీశైల మల్లికార్జునుడు, భ్రమరాంబిక అమ్మవార్లు కైలాస వాహనంలో కొలువుదీరి పురవీధుల్లో ఊరేగారు. అమ్మవారు కూష్మాండదుర్గ అలంకారంలో 8 చేతులు కలిగి కుడిచేతి వైపున పద్మం, బాణం, ధనస్సు, కమండలం, ఎడమ చేతి వైపు చక్రం, గధ, జపమాల, అమృత కలశం కలిగి ఉంటుంది. అమ్మవారు 8 భుజాలు కలిగి ఉన్నందున ఈ దేవిని అష్ట్భుజ దేవిగా కూడా పిలుస్తారు. ఇలా అలంకరించిన అమ్మవారికి ఆలయ అర్చక వేదపండితులు శాస్త్రోక్తంగా అలంకరణ పూజలు చేశారు. అలాగే ప్రత్యేకంగా అలంకరించిన కైలాస వాహనంలో కొలువుదీర్చి స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు అలంకార పూజలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో దేవస్థానం ఈఓ నారాయణ భరత్‌గుప్తా, ఆలయ అధికారులు, అర్చక వేదపండితులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కాగా సోమవారం శ్రీభ్రమరాంబికాదేవి స్కంధమాత అలంకారంలో దర్శనమివ్వనుండగా, ఆదిదంపతులు శేషవాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు.