ఆంధ్రప్రదేశ్‌

రమణీయం... మలయప్ప విహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, సెప్టెంబర్ 24: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన ఆదివారం ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపైన, రాత్రి హంస వాహనంపై సరస్వతీదేవి రూపంలో భక్తులను అనుగ్రహించారు. ఐదు తలల చిన్న శేషునిపై దర్బార్ కృష్ణుని రూపంలో చతుర్మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. వాహనం ముందు భాగాన గజరాజులు, అశ్వాలు ఠీవిగా ముందుకు కదులుతుంటే భక్తుల కోలాటాలు, డ్రమ్స్, వాయిద్యాలు, ఇతర కళాప్రదర్శనల నడుమ వాహన సేవ అత్యంత రమణీయంగా సాగింది. అనంతరం మ. 2 నుంచి 4 గంటల వరకు స్నపన తిరుమంజనం, సా. 7 నుంచి రాత్రి 8 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరిగింది. రాత్రి 9 నుంచి 11 గంటల మధ్య స్వామివారు సరస్వతీదేవి అలంకారంలో హంస వాహనంపై కొలువుదీరి జ్ఞానమూర్తిగా ప్రకాశించారు. వివిధ రకాల దివ్యాభరణాలు, పుష్పాలతో అందంగా అలంకరించగా హంస వాహనంపై కొలువుదీరిన స్వామివారు చతుర్మాడ వీధుల్లో కదలివస్తుంటే వరుణుడు సైతం తన వర్షపు జల్లులతో భక్తులను తడిపి ముద్దచేశాడు. అయితే భక్తులు ఏమాత్రం కదలకుండా స్వామిని దర్శించుకుంటూ చేసిన గోవింద నామస్మరణలతో తిరుమల గిరులు మారుమోగాయి. శ్రీవారి వాహన సేవల్లో టిటిడి ఇఓ అనిల్‌కుమార్ సింఘాల్, జెఇఓ శ్రీనివాసరాజు, పోల భాస్కర్, సివిఎస్వో రవికృష్ణ, మాజీ ఇఓ ఎల్వీ సుబ్రహ్మణ్యం, మాజీ జెఇఓ వెంకటరామిరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

చిత్రాలు..ఉదయం చిన్న శేష వాహనంపై...
*రాత్రి హంస వాహనంపై...