ఆంధ్రప్రదేశ్‌

తాటిపూడి జలాశయంలో ముగ్గురు గల్లంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గంట్యాడ, మే 24: ఓ కుటుంబం విహార యాత్ర విషాదంగా మారి ముగ్గురి ప్రాణాలు బలితీసుకుంది. మంగళవారం విజయనగరం జిల్లా గంట్యాడ మండలం తాటిపూడి జలాశయంలో ఈ విషాదం చోటుచేసుకుంది. సరదగా జలకాలాటకు జలాశయంలో దిగిన ఒకరు ఊబిలో కూరుకుపోగా వారిని రక్షించేందుకు మరొకరు దిగి అందులో చిక్కుకున్నారు. ఆ ఇద్దరిని కాపాడేందుకు మరొకరు దిగి ఇలా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతులు ముగ్గురూ విశాఖ జిల్లా సింహాచలం ప్రాంతానికి చెందినవారు. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం కనికొండల మల్లికార్జున రావు కుటుంబ సభ్యులతో సహా మంగళవారం ఉదయం వేసవి విడిదికోసం తాటిపూడి జలాశయం ఆవల కాటేజీలో బస చేసారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో మల్లికార్జున రావు పెద్ద కుమార్తె, వివాహిత అయిన గాడింకుల ధరణి(24) జలాశయంలో సరదాగా దిగింది. అక్కడ ఉన్న బురద ఊబిని గమనించకపోవడంతో అందులో కూరుకుపోయి కేకలు వేసింది. ఆమెను రక్షించేందుకు అక్కడే ఉన్న నారాయణరావు చిన్న కూమార్తె కనికొండల మనీషా గాయత్రి(20) ప్రయత్నించగా ఆమెకూడా ఊబిలో చిక్కుకుపోయింది. వారిద్దరినీ రక్షించేందుకు నారాయణరావు కుమారుడైన అశోక్(22) జలాశయంలో దిగి ప్రయత్నించే క్రమంలో ఆ ముగ్గురూ జలాశయంలో మునిగిపోయారు. దీంతో కుటుంబీకులు ఊహించని పరిణామంతో విషాదంలో మునిగారు. సమాచారం మేరకు విజయనగరం డిఎస్పీ ఎ.వి.రమణ, విజయనగరం రూరల్ సిఐ రవికుమార్, గంట్యాడ ఎస్సై తిరుపతిరావు సంఘటనా స్థలానికి వచ్చారు. మృతదేహాలకోసం జలాశయంలో మంగళవారం రాత్రి వరకూ గాలించినా లభ్యం కాలేదు.

మరో రెండ్రోజులు ఇవే ఉష్ణోగ్రతలు
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, మే 24: వాయువ్య దిశగా రాష్ట్రంపైకి వీస్తున్న పొడి, వేడి గాలుల ప్రభావం మంగళవారం కొంత మేరకు తగ్గింది. వేడి గాలుల ప్రభావం రానున్న రెండు రోజుల్లో మరింత తగ్గే అవకాశం ఉందని, కానీ ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణం కంటే మూడు డిగ్రీల సెల్సియస్ మేరకు ఎక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు మంగళవారం రాత్రి తెలిపారు. వేడి, పొడి గాలుల ప్రభావం కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలకే పరిమితం కావడంతో కొన్ని ప్రాంతాల ప్రజలు భానుడి ప్రతాపం నుంచి కొంత ఉపశమనం పొందారని తెలిపారు. గన్నవరం, బాపట్లలో 44.7 డిగ్రీలు, ఒంగోలులో 44.1, కాకినాడలో 43.3, విశాఖ విమానాశ్రయంలో 39.2 డిగ్రీలు నమోదు అయింది. గన్నవరం, బాపట్లలో సాధారణం కంటే మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదు అయింది. వాయువ్య దిశ నుంచి వీస్తున్న గాలులు సముద్రం నుంచి వీస్తున్న తేమ గాలులను అడ్డుకోవడం వల్ల పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు అవుతున్నాయన్న అభిప్రాయం వాతావరణ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.