ఆంధ్రప్రదేశ్‌

బ్యాంకర్లు సహకరిస్తేనే ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 7: ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు వివరించి అవి సద్వినియోగం అయ్యేలాగా బ్యాంకర్లు తోడ్పాటు అందించినప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక, భూ విజ్ఞాన శాఖల సహాయ మంత్రి సుజనా చౌదరి తెలిపారు. శనివారం విజయవాడలోని ఏ కనె్వన్షన్ సెంటర్‌లో ముద్ర యోజన పథకం ప్రచార, అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న సుజాన చౌదరి మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు అనుకున్న విధంగా లబ్ధిదారులకు చేరువ కావాలంటే బ్యాంకర్లు స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటేనే సత్ఫలితాలు సాధించటానికి అవకాశం ఉంటుందన్నారు. దేశ వ్యాప్తంగా ముద్ర యోజన పథకాన్ని ఎంత మంది ఉపయోగించుకుంటున్నారో తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతో దేశవ్యాప్తంగా 50 కేంద్రాల్లో ఏర్పాటు చేస్తున్న అవగాహన కార్యక్రమాల్లో భాగంగానే ఈ సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మానస పుత్రిక ముద్ర యోజన అని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మహిళలు, పేదల ఆర్థికాభివృద్ధి కోసం ఔత్సాహిక పారిశ్రామికులను ప్రోత్సహించేవారిలో ముందు వరసలో ఉండే వ్యక్తన్నారు. అటువంటి నాయకుల ఆధ్వర్యంలో ముద్ర పథకాన్ని నిజమైన లబ్ధిదారులకు చేరవేయడంలో బ్యాంకర్ల పాత్ర కీలకమైనదన్నారు. రుణాలు అందించటంతోపాటు రుణ వసూలు విధానంతోపాటు, వడ్డీ రేటు కాలపరిమితిపై అవగాహన కల్పించాలన్నారు. గ్రామాల్లో లోన్లు పొందే ప్రతి వ్యక్తి తాను రుణం పొందడంతోపాటు పదిమందికి ఉపాధి కల్పించేలాగా తయారు కావాలన్నదే ప్రధానమంత్రి మోదీ లక్ష్యమన్నారు. అందుకోసమే ఈ ముద్ర పథకం అమలుకు శ్రీకారం చుట్టారన్నారు. లబ్ధిదారులు ముద్ర పథకం కింద రూ.50వేల నుంచి కోటి రూపాయల వరకు ఎటువంటి హామీ లేకుండా రుణాలు పొందవచ్చని తెలిపారు. బ్యాంకర్లు కూడా వచ్చే ప్రతిపాదనలను అధ్యయనం చేసి ప్రణాళికాబద్ధమైన ప్రాజెక్టు రిపోర్టును అనుసరించి సరళీకృత విధానంలో రుణాలు అందజేయాలన్నారు. ఇప్పటికే ముద్ర లోను పొందిన లబ్ధిదారుల విజయ గాథలను క్షేత్రస్థాయిలో తీసుకువెళ్లాలన్నారు. ముద్ర పథకం కింద వ్యాపారాలు వృద్ధితోపాటు వివిధ రంగాలకు సంబంధించిన యూనిట్ల స్థాపనకు అనుకూలంగా ఉండటంతోపాటు వారి కుటుంబాల ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చుకోవచ్చన్నారు. 2022కి నవ భారతదేశం కల సాకారం కావాలంటే లబ్ధిదారులకు ముద్ర యోజనను చేరువ చేయాలన్నారు. ముద్ర యోజనలో తేనెటీగల పెంపకం, లైవ్ స్టాక్స్, ఫౌల్ట్రీ రంగం తదితరమైన వాటికి రుణాలను తీసుకోవచ్చన్నారు. సన్నకారు, మధ్యతరగతి రైతులకు రుణాలు అందించవచ్చన్నారు. దేశ వ్యాప్తంగా ఎస్సీలకు 18 శాతం, బిసిలకు 35 శాతం, ఎస్టీలకు 8 శాతం లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేశారన్నారు. ముద్ర పథకం కింద ఎస్సీ లబ్ధిదారుల శాతం పెరగాలన్నారు. మహిళా ప్రాధాన్యం 52 శాతంగా మెరుగైన స్థితిలోనే ఉందన్నారు. ముద్ర యోజన పథకం గురించి కొద్దిమందికైనా మేలు జరిగేలా చేయటానికి ఈ సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముద్ర యోజన పథకం ప్రచారానికి 50 ప్రదేశాల్లో ఏర్పాటు చేశాయన్నారు. దీని ద్వారా నిజమైన లబ్ధిదారులకు ఇది చేరువ అవడానికి అవకాశం ఉంటుందన్నారు. బ్యాంకర్లు అర్హత కలిగిన లబ్ధిదారులకు రుణాల మంజూరులో తగిన చర్యలు చేపట్టాలన్నారు. లబ్ధిదారులకు రుణాలు ఇప్పంచడంలో స్థానిక ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో చేపడితే, రుణాల వసూళ్లలో కూడా వీరు దగ్గర ఉండి వసూలు చేయడానికి సహకరిస్తారన్నారు. మచిలీపట్నం ఎంపి కొనకళ్ల నారాయణ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి పెద్దఎత్తున వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. పథకాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం అధికారులపై ఉందన్నారు. కేంద్ర మంత్రి సుజనా చౌదరి తన ప్రసంగం అనంతరం కార్యక్రమానికి హాజరైన వారి నుంచి పథకం మంజూరులో ఇబ్బందులు, లోపాలను మాట్లాడించారు. ముద్ర యోజన పథకం ప్రచారంపై ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ, నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్, తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు, ఆంధ్రాబ్యాంక్ ఎండి సురేష్ పాటిల్, ఆంధ్రాబ్యాంక్ ఈడి ఎకె రాత్, ఆర్బీఐ జిఎం సుబ్బయ్య, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ డిడిజి, డిఎఫ్‌ఎస్ (జివోటి) అంజనా దుబే, నాబార్డ్ సిజిఎం సురేష్‌కుమార్, సిడ్‌బి జిఎం సంపత్‌కుమార్, ఇండియన్ బ్యాంక్ జిఎం చంద్రారెడ్డి, ఎస్‌ఎల్‌బిసి కన్వీనర్ కృష్ణారావు, ఎస్‌బిఐ సిజిఎం మణి, ఎల్‌డిఎం వెంకటేశ్వరరెడ్డి, కలెక్టర్ బి.లక్ష్మీకాంతం, తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..ముద్ర రుణాలపై అవగాహన సదస్సులో మాట్లాడుతున్న కేంద్రమంత్రి సుజనా చౌదరి