ఆంధ్రప్రదేశ్‌

రైల్వే బ్రిడ్జిపై విరిగిపడిన కొండచరియలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 10: భారతీయ రైల్వేకు ఆర్థిక వెనె్నముకగా నిలిచే ఈస్ట్‌కోస్ట్ రైల్వే వాల్తేర్ డివిజన్‌కు వర్షాలు తీవ్ర నష్టాన్ని తెచ్చిపెడుతున్నాయి. ప్రతి ఏడాది వర్షాకాలం వస్తే కెకె లైన్ మార్గంలో రైల్వేట్రాక్, బ్రిడ్జిలపై కొండ చరియలు విరిగిపడుతుంటాయి. ఈ సంఘటనలు వాల్తేర్ డివిజన్‌లో సర్వసాధారణమవుతున్నా వీటి నివారణ చర్యలకు దశాబ్దాలు గడుస్తున్నా పరిష్కారం లభించడం లేదు. దీనివల్ల కోట్లాది రూపాయల రైల్వే ఆస్తులకు నష్టం వాటిల్లుతుండగా మరోపక్క పునరుద్ధరణ పనులకు రోజులు, నెలలు పడుతున్నాయి. అలాగే వీటికి వెచ్చించే నిధులు రైల్వేకు తడిసిమోపెడవుతున్నాయి. కెకె లైన్ మార్గంలో చిమిడిగుడ- బొర్రాగుహల రైల్వే సెక్షన్ మధ్యలో రైల్వే బిడ్జ్రికి చెందిన భారీ స్తంభంపై సమీప కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో ఈ మార్గంలో రోజూ నడిచే గూడ్స్ రైళ్ళకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. రోజుకు 15 నుంచి 22 వరకు గూడ్స్ రైళ్ళు ఈ మార్గంలో నడుస్తుంటాయి. ఇనుప ఖనిజం, బొగ్గు, జిప్సమ్, సిమెంట్, నిత్యావసర సరకులు గూడ్స్ రైళ్ళ ద్వారా దేశ, విదేశాలకు ఈ మార్గంలోనే వెళ్తుంటాయి. ఇటీవల జరిగిన సంఘటనతో అప్రమత్తమైన డివిజన్ అధికారులు, ఆయా విభాగాల ఉద్యోగులు బృందాలుగా ఏర్పడి దెబ్బతిన్న స్తంభం వద్ద పునరుద్ధరణ పనులు చేపట్టారు. అయితే పూర్తిస్థాయిలో ఈ మార్గం అందుబాటులోకి వచ్చి యధావిధిగా గూడ్స్ రైళ్ళు నడిపేందుకు 45 నుంచి 60 రోజుల వరకు సమయం పట్టవచ్చని డివిజన్ అధికారులు చెబుతున్నారు. అప్పటి వరకు కిరండూల్ పాసింజర్ రైలు రద్దుకాగా, కొన్ని గూడ్స్‌లను రాయగడ నుంచి ప్రత్యామ్నాయ మార్గంలో నడుపుతున్నారు. కాగా దేశ, విదేశాల నుంచి తరలివచ్చే పర్యాటకులకు ఇదే సీజన్, ముఖ్యంగా బెంగాలీయులు నవంబర్ నుంచి జనవరి వరకు శీతాకాలంలో అనుభూతిని పొందేందుకు, తూర్పుకనుమల ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు ఎక్కువుగా వస్తుంటారు. అటువంటిది ఈ సమయంలోనే ఈ మార్గంలో కొండచరియలు విరిగిపడటంతో కిరండూల్ పాసింజర్ రద్దయ్యింది. విస్టాడోమ్ ఏసి కోచ్‌ల్లో పర్యాటకులు వెళ్ళే అవకాశం లేకుండాపోయింది.