ఆంధ్రప్రదేశ్‌

నవంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 10: ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు వచ్చే నవంబరు మొదటి వారంలో నిర్వహించనున్నట్టు స్పీకర్ కోడెల శివప్రసాద్ వెల్లడించారు. శాసనసభ వర్షాకాల, శీతాకాల సమావేశాలు రెండు కలిపి నవంబరు మొదటి వారంలో ప్రారంభమై, పది రోజులపాటు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. వచ్చే నవంబరు నెలలో బంగ్లాదేశ్‌లో జరగనున్న కామన్‌వెల్త్ దేశాల పార్లమెంటరీ కాన్ఫరెన్స్ సందర్భంగా లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అధ్యక్షతన మంగళవారం పార్లమెంట్‌లో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కోడెల హాజరయ్యారు. ఈ పర్యాటనలో ఉపరాష్టప్రతి వెంకయ్య నాయుడు, కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్, పర్యావరణ అధికారులతో కోడెల భేటీ అయ్యారు. అనంతరం కోడెల మాట్లాడుతూ ఉపరాష్టప్రతిని మార్యదపూర్వకంగా కలిసినట్టు తెలిపారు. ప్రకాశ్ జావడేకర్‌ను కలిసి ఇటీవల సత్తెనపల్లిలో కేంద్రీయ విద్యాలయాన్ని ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపినట్టు వెల్లడించారు.
ఈ కేంద్రీయ విద్యాలయంలో రిజర్వుడ్ సిట్లు భర్తీ కావడం లేదని, భర్తీకాని సీట్లను జనరల్ కేటగిరి వారికి అడ్మిషన్లకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు. దీనికి కేంద్ర మంత్రి సానుకూలత వ్యక్తం చేశారని పేర్కొన్నారు. అలాగే కేంద్ర పర్యావరణ అధికారులతో సమావేశమై కోటప్పకొండ ప్రాంతాన్ని పర్యావరణం నుండి కాపాడంతోపాటు, దాని అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరినట్టు చెప్పారు.

చిత్రం..ఉపరాష్టప్రతి వెంకయ్యనాయుడితో స్పీకర్ కోడెల