ఆంధ్రప్రదేశ్‌

‘ఇంటివద్దే సంపాదన’ పేరుతో కుచ్చుటోపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోరుకొండ, అక్టోబర్ 10: ‘ఇంటి వద్దే ఉంటూ నెలకు రూ.20 వేల నుండి రూ.40వేల వరకు సంపాదించుకోవచ్చు’ ఇలాంటి ప్రకటన చూస్తే ఎవరైనా ఆకర్షితులవుతారు... అలా ఆకర్షితులైన సంప్రదించిన వారికి పేపరు ప్లేట్లు తయారుచేసే యంత్రం, ముడిసరుకు ఇచ్చి, తయారైన ప్లేట్లు తాము తీసుకుని, కొంత మొత్తం కమిషన్ ఇస్తామని తెలిపిందో సంస్థ. అయితే ఈ పథకంలో చేరడానికి మాత్రం ఒక్కొక్కరు రూ.2 లక్షల నుండి రూ.4 లక్షల వరకు డిపాజిట్ చేయాల్సివుంటుంది. ఇందులో యంత్రం ఖరీదు, ముడిసరుకు డిపాజిట్‌గా ఉంచుకుని రూ.60 వేల నుంచి రూ.70 వేల వరకు మూడు నెలల్లో తిరిగిస్తామని ఆ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. దీనితో ఆకర్షితులైన పలువురు లక్షల్లో డిపాజిట్ చేశారు. వారందరికీ సుమారు రూ.90వేలు విలువచేసే యంత్రాలు సరఫరాచేశారు. అయితే ప్లేట్లు తయారీకి అవసరమైన ముడిసరుకు సరఫరాచేయలేదు. అలాగే మూడు నెలల తర్వాత తిరిగిస్తామన్న మొత్తానికి ఇచ్చిన చెక్కులూ చెల్లకుండా పోయాయి. దీనితో విసిగిపోయిన బాధితులు మంగళవారం ఆందోళనకు దిగారు. ఆ సంస్థ యజమాని, ప్రతినిధులను నిలదీసి, పోలీసులకు అప్పగించారు. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం గాడాల గ్రామం కేంద్రంగా ఈ వ్యవహారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... గాడాలకు చెందిన పచ్చిగోళ్ల దివాకర్, అతని తల్లి పేరుమీద సాయి విఘ్నేష్ ఏజన్సీ అనే సంస్థ ఏర్పాటుచేసి తెలుగు రాష్ట్రాల్లోని గుంటూరు, తూర్పుగోదావరి, సూర్యాపేట, వరంగల్, కృష్ణా, ఖమ్మం, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం తదితర ప్రాంతాల్లో ఏజెంట్లను ఏర్పాటుచేసుకున్నాడు. వఆరు నెలలు గడుస్తున్నా వారికి పేపరు పేట్లు తయారీకి అవసరమైన ముడిసరుకు అందజేయలేదు.