ఆంధ్రప్రదేశ్‌

ఎన్‌టిపిసి చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ అక్రమాస్తులు రూ.10 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, అక్టోబర్ 11: ఎన్‌టిపిసిలో చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ఐఎఫ్‌ఎస్ అధికారి ఎం.రాంప్రసాదరావు ఆస్తులపై సిబిఐ సోదాలు నిర్వహించింది. ప్రసాదరావు ఆదాయానికి మించి సుమారు 10 కోట్ల రూపాయల అక్రమ ఆస్తులు కూడ బెట్టినట్టు సిబిఐ సోదాల్లో వెల్లడైంది. దీనికి సంబంధించి విశాఖ సిబిఐ అధికారులు బుధవారం అందించిన వివరాల ప్రకారం 2012 ఫిబ్రవరి నుంచి 2016 జూలై మధ్య ప్రసాదరావు 10,72,14,000 రూపాయల అక్రమ ఆస్తులు కూడబెట్టినట్టు సిబిఐ ఎస్‌పి తెలియచేశారు. ప్రసాదరావు, బంధువులకు సంబంధించి మీరట్, పశ్చిమ గోదావరి జిల్లా తణుకు తదితర ప్రాంతాల్లో కూడా సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా 37.25 లక్షల నగదు, విలువైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.

శ్రీవారి ఉగ్రాణం తరలించే యోచన

తిరుపతి, అక్టోబర్ 11: తిరుమల శ్రీవారి ప్రసాదాల తయారీకి వినియోగించే సరుకులను నిల్వ ఉంచే ఉగ్రాణాన్ని టిటిడి తిరుమల జెఇఓ శ్రీనివాసరాజు బుధవారం ఉదయం చీఫ్ ఇంజనీర్ చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. జెఇఓ మాట్లాడుతూ టిటిడి ఇఓ ఆదేశాల మేరకు దక్షిణ మాడ వీధిలోని ఉగ్రాణం పాత భవనాన్ని తొలగించి పడమర భాగాన తీర్థకట్ట వీధికి పక్కన ఉన్న ప్రాంతంలో సరుకులు సులువుగా చేర్చేందుకు వీలుగా నూతన భవనం నిర్మించే ప్రతిపాదనపై పరిశీలించినట్లు తెలిపారు. బూందీ పోటులో నిల్వ ఉంచే శనగపిండిని బయటకు తరలిస్తే గాలి, వెలుతురు సక్రమంగా ఉంటే వేడి తగ్గి ప్రమాదాల బారినపడకుండా చూడవచ్చన్నారు. శ్రీవారి ఆలయం లోపల పోటు, అదనపు పోటులో అదనంగా స్థలాన్ని గుర్తిస్తే అదనపు లడ్డూల తయారీకి అవకాశముంటుందని, దీనిపై కూడా పరిశీలన జరిపామని తెలిపారు. అదేవిధంగా విజిఓ కార్యాలయాన్ని ఆధునీకరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

ఏసిబికి చిక్కిన సిఐ
ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, అక్టోబర్ 10: ఇక్కడి టూ టౌన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న నర్సింహమూర్తి, హెడ్‌కానిస్టేబుల్ విజయభాస్కర్ పాల్‌ను లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు వలపన్ని పట్టుకున్నారు. పేకాట కేసులో ఒక ఫైనాన్స్ వ్యాపారిని తప్పించేందుకు సిఐ నర్సింహమూర్తి రూ.50 వేలు డిమాండ్ చేశాడు. బుధవారం మధ్యాహ్నం 1.20 గంటల సమయంలో టూటౌన్ స్టేషన్‌కు సమీపంలో పార్కు గేటు వద్ద ఆ మొత్తాన్ని కె.రాఘవరెడ్డి అనే ఫైనాన్స్ వ్యాపారి హెడ్ కానిస్టేబుల్ విజయభాస్కర్ పాల్‌కు అందజేశాడు. ఈ మొత్తాన్ని సిఐ నర్సింహమూర్తి స్టేషన్‌లో అందుకుంటుండగా ఎసిబి అధికారులు దాడి చేసి సిఐని, హెచ్‌సిని పట్టుకున్నారు. ఈ నెల 4న సన్ స్కూల్ సమీపంలో కె.రాఘవరెడ్డి, మరి కొంత మంది పేకాట ఆడుతుండగా సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నప్పటికీ కేసులో మాత్రం తక్కువ మొత్తం చూపినట్టు సమాచారం. అప్పటి నుంచి ఈ కేసు నుంచి రాఘవరెడ్డిని తప్పించేందుకు సిఐ నర్సింహమూర్తి రూ.50వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో ఆ వ్యాపారి ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. వ్యాపారవేత్త ఫిర్యాదు మేరకు ఎసిబి డిఎస్పీ షకీలాబాను ఆధ్వర్యంలో సిబ్బంది రంగంలోకి దిగి వలపన్ని సిఐ, హెడ్‌కానిస్టేబుల్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇద్దరినీ అరెస్టు చేశామని డిఎస్పీ తెలిపారు. ఈ దాడిలో డిఎస్పీతోపాటు సిఐ లక్ష్మోజి, రమేష్ పాల్గొన్నారు. ఇదిలా ఉండగా పోలీసులు అవినీతికి, అక్రమాలకు పాల్పడరాదని డిజిపి ఎన్.సాంబశివరావు హితబోధ చేసి 24 గంటలు కాక ముందే సిఐ నర్సింహమూర్తి అవినీతికి పాల్పడటం గమనార్హం.