ఆంధ్రప్రదేశ్‌

పన్నులు వేయండి.. సేవలు ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 11: మున్సిపల్ కౌన్సిలర్లు తమ పరిధిలోని ప్రజల ఆభిష్టాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసి, వారి ఆదరాభిమానాలను పొందాలని ఉపరాష్టప్రతి వెంకయ్య నాయుడు సూచించారు. బుధవారం విజయనగరం మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ నేతృత్వంలో 40 మంది కౌన్సిలర్లు ఉపరాష్టప్రతిని కలిశారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ ఎన్నికల దృష్టిలో ఉంచుకుని ప్రజలపై పన్నుభారం విధిస్తే ఓట్లు పడవనే భావనతో సరిగ్గా పన్నులు వసూలు చెయ్యని సందర్భాలు ఉన్నాయని, ఇది మంచిది కాదని అన్నారు. ప్రజల నుండి పన్నులు వసూలు చేసి, జవాబుదారీతనంతో ఖర్చుచేసి మున్సిపాలిటీల అభివృద్ధికి కృషి చేయ్యాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజలు తాము చెల్లించిన పన్నులతో అభివృద్ధి జరుగుతుందంటే పన్నులు చెల్లించేందుకు వెనకాడరని ఆయన పేర్కొన్నారు. ప్రజలనుంచి పన్నుల రూపంలో వసూలు చేసిన నిధులను అభివృద్ధి కార్యక్రమాలకు మాత్రమే కేటాయించాలని, నిధులను దారి మళ్లించడం తగదని అన్నారు. దేశంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు ఒక ప్రజా ఉద్యమంలా కొనసాగుతున్నాయని, మున్సిపాలిటీలోని ప్రతి ఒక్కరు బాధ్యతగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాలను చేపట్టాలని కౌన్సిలర్లకు ఉద్బోధించారు.