ఆంధ్రప్రదేశ్‌

ప్రతి పేదకూ సొంతగూడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 11: ప్రతి పేదకు సొంత ఇల్లు నిర్మించి ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కాలవ శ్రీనివాసులు చెప్పారు. ప్రాజెక్టు డైరెక్టర్ల సమీక్ష అనంతరం మంత్రి కాలవ సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ లక్ష్య సాధనలో డ్వాక్రా సంఘాల మహిళలు కృషి చేస్తున్నారన్నారు. సమీక్ష సమావేశంలో ఇళ్ల నిర్మాణం, పురోగతిపై సమీక్షించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు చెప్పారు. దేశంలో ప్రతి పేదకు సొంత ఇల్లు అన్న ఆలోచన చేసిన మొదటి వ్యక్తి స్వర్గీయ ఎన్టీరామారావు అని, అందువల్ల ఆయన పేరుమీద గృహ నిర్మాణ పథకం చేపట్టినట్లు తెలిపారు. ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద ఏటా రెండు లక్షల ఇళ్లు మంజూరు చేస్తున్నామని, ఇప్పటికి ఆరు లక్షల ఇళ్లు మంజూరు చేసినట్లు చెప్పారు.
ఉపయోగపడని పిఎంజివై
ప్రధాన మంత్రి గ్రామీణ యోజన పథకం రాష్ట్రంలోని అవసరాలకు తగిన విధంగా ఉపయోగపడటం లేదని మంత్రి కాలవ చెప్పారు. సామాజిక ఆర్థిక అంశాల ప్రాతిపదికగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 2011లో జరిపిన సర్వేలో రాష్ట్రంలో 5 లక్షల 82 వేల మంది మాత్రమే ఇళ్లు లేనివారు ఉన్నట్లు గుర్తించారన్నారు. ఆ తరువాత మళ్లీ 2 లక్షల 57 వేల మంది మాత్రమే ఉన్నట్లు తేల్చారని చెప్పారు. ఆ ప్రకారం కేంద్రం 2016-17లో 72,885 ఇళ్లు, 2017-18లో 48,058 ఇళ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో 2016లో నిర్వహించిన ప్రజాసాధికార సర్వే ప్రకారం 31,52,749 మంది తమకు పక్కా ఇళ్లు కావాలని కోరినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు 13 అంశాల ప్రాతిపదికగా నియమ నిబంధనలు రూపొందించి గ్రామ సభల ద్వారా సేకరించిన వివరాల ప్రకారం 20,98,513 మంది ఇళ్ల మంజూరుకు అర్హులుగా నిర్ధారించినట్లు తెలిపారు. జిల్లాల వారీగా ఈ మొత్తం పేదల పూర్తి వివరాలు కేంద్ర వెబ్‌సైట్ ఆవాస్ సాఫ్ట్‌లో అప్‌లోడ్ చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో వాస్తవ పరిస్తితి, అర్హుల సంఖ్య కేంద్ర మంత్రి, సంబంధిత అధికారులకు వివరించడానికి తాను, ఎండి త్వరలో ఢిల్లీ వెళతామన్నారు. మరిన్ని గృహాలు కేటాయించమని కోరతామని తెలిపారు.
జూన్ 8 నాటికి 5 లక్షల ఇళ్లు పూర్తి
వచ్చే జూన్ 8 నాటికి రాష్ట్రంలో 5 లక్షల ఇళ్లు పూర్తి చేయాలని గ్రామీణ గృహ నిర్మాణ శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు.. ప్రాజెక్టు డైరెక్టర్లకు, ఇంజనీర్లను, ఇతర అధికారులను ఆదేశించారు. వెలగపూడి సచివాలయం 4వ బ్లాక్‌లోని సమావేశ మందిరంలో బుధవారం ఉదయం ప్రాజెక్టు డైరెక్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే జనవరి 10 నాటికి రాష్ట్రంలో 13 జిల్లాల్లో 1.25 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని నిర్దేశించారు. 2019 నాటికి 10 లక్షల ఇళ్లు పూర్తి చేయాలన్నారు. నియోజకవర్గాల వారీగా లక్ష్యాలను పూర్తి చేసే బాధ్యత డీఈలదేనని చెప్పారు. రోజుకు వెయ్యి ఇళ్ల చొప్పున నెలకు 30 వేలు, అదనంగా మరో 5 వేలు కలుపుకొని 35 వేల ఇళ్లు నిర్మించాలన్నారు. రోజువారీ పనులు సమీక్షించుకుంటూ ముందుకు సాగాలని మంత్రి సూచించారు. ఆయా నియోజకవర్గాల్లో స్థానిక పరిస్థితులు, సామాజిక సమస్యలు, ఇళ్ల నిర్మాణానికి అనుకూలమైన వాతావరణం, నెట్, సర్వర్ వంటి సాంకేతిక సమస్యలు, తదితర అంశాలను చర్చించారు.