ఆంధ్రప్రదేశ్‌

వర్షాలపై అప్రమత్తంగా ఉండండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 11: గత 15 సంవత్సరాల్లో లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో చెరువులు, కాల్వల్లో నీళ్లు భారీగా ప్రవహిస్తున్నాయని అధికారులు అప్రమ్తంగా ఉండి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. బుధవారం జలవనరులశాఖ కార్యాలయంలో 13 జిల్లాలకు చెందిన సీఈ, ఎస్‌ఈలతో వర్షాలపై వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో చెరువులు నిండి ప్రవహిస్తున్నాయని అధికారులు అప్రమత్తంగా ఉండి, నిండుతున్న చెరువులు వల్ల ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాల్సిన అవసరం అధికారులపై ఉందని, వాస్తవ పరిస్థితులను పై అధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలన్నారు. ఇప్పటికీ శ్రీశైలం డ్యాంలో లక్ష క్యూసెక్కుల నీళ్లు వస్తున్నాయని, ఇది గురువారానికి లక్షా ఐదు వేల క్యూసెక్కులకు పెరుగుతుందని మంత్రికి అధికారులు తెలిపారు. చెరువుల్లో నీటి నిల్వలు పెంచటం, వీలైతే గొలుసుకట్టు చెరువుల ద్వారా అన్ని చెరువులు నిండే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు. కాల్వలకు గండ్లుపడి ఇబ్బంది తలెత్తే పరిస్థితులు ఉన్న దృష్ట్యా అధికారులు తక్షణం అలాంటి ప్రదేశాలు గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా రాయలసీమలో ఇదివరకెన్నడూ లేని విధంగా వర్షాలు పడుతున్నాయని, అక్కడ అధికారులు మంత్రికి తెలిపారు. జలవనరుల శాఖ చేపట్టిన నీటి కుంటలు, పంట కుంటలు, చెక్‌డ్యామ్‌ల నిర్మాణాలు, పూడికతీత వల్ల ఎక్కడ పడిన వర్షం అక్కడే భూగర్భ జలాలుగా మారుతున్నాయని దీని వల్ల భూగర్భ జల మట్టాలు పెరుగుతున్నాయని వారికి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యలు వల్ల ఇప్పుడు అవి వాస్తవ కార్యరూపం దాల్చతున్నాయన్నారు. అనంతపురం జిల్లా సింగనమలలో వర్షాల వల్ల గతంలో ఎన్నడూలేని విధంగా చెరువులు నిండాయన్నారు. శ్రీకాకుళం జిల్లాలో కూడా వర్షాలు ఎక్కువగా కురవటం వల్ల చెరువులు నిండాయన్నారు. మేజర్ డ్యాంలు, మైనర్ డ్యాంలు, చెరువులు తదితరమైన వాటిల నీటి నిల్వల పరిస్థితి ఎలా ఉన్నదీ ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో 13 జిల్లాల సీఈ, ఎస్‌ఈలు, ఇంజనీరింగ్ అధికారులు, సచివాలయం నుంచి ఇంజనీరింగ్ అధికారులు, జలవనరులశాఖ కార్యదర్శి శశిభూషన్, ఈఎన్‌సి వెంకటేశ్వరరావు, ఇంజనీరింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.