ఆంధ్రప్రదేశ్‌

ఐదేళ్ళలో పూర్తిగా ప్రకృతి వ్యవసాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, అక్టోబర్ 11: రాబోయే ఐదేళ్ళలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయం చేపట్టనున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయం సాగు పెంపుదలకు ప్రభుత్వంతో కలిసి పని చేయడానికి యునైటెడ్ నేషన్స్ ఎనిర్వాన్‌మెంటల్ ప్రోగ్రామ్ (యుఎన్‌పి) ముందుకొచ్చిందన్నారు. ఇందుకోసం ఆ సంస్థ ఆర్థికసాయంతో పాటు సాంకేతిక పరిజ్ఞానం కూడా అందజేయనుందన్నారు. సచివాలయంలోని పబ్లిసిటీ సెల్ నాలుగో బ్లాక్‌లో బుధవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 974 గ్రామాల్లో లక్ష ఎకరాల్లో లక్షా 40 వేల రైతులతో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రకృతి వ్యవసాయంతో రైతులకు ఖర్చు తగ్గడంతో పాటు ఆదాయం పెరుగుతుందన్నారు. రసాయనిక ఎరువుల వాడకం తగ్గితే, పర్యావరణ పరంగా కూడా ఎంతో మేలు కలుగుతుందన్నారు. ప్రకృతి వ్యవసాయం సాగు చేయడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటిస్థానంలో నిలిచిందన్నారు. ఈ విషయాన్ని గుర్తించిన యునైటెడ్ నేషన్స్ ఎనిర్వాన్‌మెంటల్ ప్రోగ్రామ్ ఎపితో కలిసి పనిచేయడానికి ముందుకొచ్చిందన్నారు. ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎడిక్ సొలిహిమ్ నేతృత్వంలో ఒక బృందం రాష్ట్రానికి త్వరలో రానుందన్నారు. ఈ నెల 15 నుంచి 18 తేదీ వరకూ రాష్ట్రంలో కృష్ణాతో పాటు పలు జిల్లాల్లో ఆ సంస్థ బృందం పర్యటించనుందన్నారు. రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయం సాగు మరింత పెంచేందుకు ఈ సంస్థ ప్రభుత్వానికి అన్ని రకాల సాయం చేయనుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12,900 పంచాయతీల్లో ప్రకృతి వ్యవసాయం సాగు పెంచాలని ఆ సంస్థ భావిస్తోందన్నారు. ఇప్పటికే ప్రకృతి వ్యవసాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.700 కోట్లు వెచ్చిస్తోందన్నారు. అజీమ్ ప్రేమ్‌జీ సంస్థ కూడా రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయం కోసం రూ.100 కోట్లు వెచ్చిస్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయం సాగు చేయడానికి రూ.10వేల కోట్లు వ్యయమవుతుందన్నారు. ఈ మొత్తం భరించడంతో పాటు సాంకేతిక పరిజ్ఞానం అందించడానికి యునైటెడ్ నేషన్స్ ఎనిర్వాన్‌మెంటల్ ప్రోగ్రామ్ ముందుకొచ్చిందన్నారు. ఇదో పెద్ద ముందడుగు అని మంత్రి తెలిపారు.

15న ప్రతిభా
పురస్కారాల ప్రదానం

విజయవాడ, అక్టోబర్ 11: రాష్టస్థ్రాయి ప్రతిభా పురస్కారాల ప్రదాన కార్యక్రమం ఈ నెల 15వ తేదీన నిర్వహించనున్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో మానవ వనరుల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారాల కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు కృష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారన్నారు. స్టేడియంలో చేపట్టవల్సిన ఏర్పాట్లను బుధవారం కలెక్టర్ పరిశీలించి, అధికారులకు సూచనలు చేశారు. 2017 విద్యా సంవత్సరంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 6,600 మందికి పురస్కారాలు అందజేస్తామన్నారు. పదవ తరగతిలో 4వేల మంది, ఇంటర్ 600 మంది, డిగ్రీ, పిజి కోర్సుల్లో 2వేల మంది విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేయనున్నారు. సుమారు 12వేల మంది విద్యార్థులు హాజరుకానున్న దృష్ట్యా ఏర్పాట్లు అందుకు తగ్గట్టుగా ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు.