ఆంధ్రప్రదేశ్‌

ప్రారంభమైన అగ్రిగోల్డ్ బాండ్ల పరిశీలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), అక్టోబర్ 12: రాష్ట్రంలో అగ్రిగోల్డ్ సంస్థ బాధితుల బాండ్ల పరిశీలన గురువారం నుంచి ప్రారంభమైంది. నాలుగు రాష్ట్రాల్లో అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారు. రాష్ట్ర హైకోర్టు ఆదేశానుసారం ఆంధ్రప్రదేశ్‌లో డిపాజిట్‌దారుల సంఖ్య అంచనా వేసేందుకు సిఐడి చేపట్టిన చర్యల్లో భాగంగా ఈ బాండ్ల పరిశీలన జరుగుతోంది. సంస్థకు డబ్బు చెల్లించి నష్టపోయిన వారి జాబితా రాష్ట్రం లో సుమారు 19లక్షల వరకు ఉందని సిఐడి అంచ నా వేసింది. ఇదే విషయాన్ని హైకోర్టుకు తెలియచేసింది. అగ్రి ఆస్తులను సీజ్ చేసి వేలం వేయడం ద్వారా సంక్రమించే డబ్బును దశలవారీగా.. ఖాతాదారుల చెల్లించిన సొమ్మును బట్టి వారికి న్యాయం చేసేందుకు కోర్టు మార్గదర్శకాల ప్రకారం సిఐడి రాష్టవ్య్రాప్తంగా గురువారం నుంచి బాండ్ల పరిశీలన ప్రక్రియ చేపట్టింది. దీనిలో భాగంగా రాష్టవ్య్రాప్తంగా 405 ప్రాంతాల్లో 715 కౌంటర్లు ఏర్పాటు చేయగా.. తొలిరోజు 13వేల మంది ఖాతాదారుల బాండ్ల పరిశీలన జరిగింది. సిఐడి జాబితా ప్రకారం సుమారు 19లక్షల మంది బాధితుల సంఖ్యకుగాను ఆన్‌లైన్ ద్వారా ఇప్పటికే నమోదు చేసుకున్న వారి సంఖ్య 9.9లక్షలు మంది కాగా.. వీరందరికి సంబంధించి బాండ్ల పరిశీలన పూర్తి కావాల్సి ఉంది. ఇదే సమయంలో లక్ష్యాన్ని అధిగమించేలా ఇంకా నమోదు చేసుకోని ఖాతాదారులు ముందుకు రావాల్సి ఉంది. 15రోజుల పాటు కొనసాగే వెరిఫికేషన్ ప్రక్రియలో నమోదైన కస్టమర్ల బాండ్ల పరిశీలనతోపాటు కొత్తగా బాధితులు ఆన్‌లైన్‌లో నమోదు కావాల్సి ఉన్నందున ఇందుకు కూడా ప్రత్యేక ఏర్పాటు చేశారు. కాగా తొలిరోజు కొత్తగా పదివేల మంది ఖాతాదారులు రిజిస్టర్ చేసుకునేందుకు తరలివచ్చారు. వీరందరి వివరాలు తీసుకున్న సిబ్బంది కౌంటర్ల వద్ద వారికి టోకెన్లు ఇచ్చి పంపారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి టోకెన్ల ప్రకారం ఆయా తేదీల్లో బాండ్ల పరిశీలన ఉంటుంది. ఇదిలావుండగా విజయవాడలో కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన 17 కౌంటర్లలో బాండ్ల పరిశీలన జరుగుతోంది. గురువారం అగ్రిగోల్డ్ బాధితుల సంఘం అధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు ఇక్కడకు వచ్చి ఈ ప్రక్రియను పరిశీలించారు.