ఆంధ్రప్రదేశ్‌

గన్నవరంలో మరోసారి భూప్రకంపనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గన్నవరం, అక్టోబర్ 12: కృష్ణా జిల్లా గన్నవరంలో గురువారం మధ్యాహ్నం మరోసారి భూప్రకంపనలు చోటు చేసుకోవడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. గత మంగళవారం రాత్రి సమయంలో నాలుగుసార్లు భూమి కంపించిన భయం నుండి తేరుకోకముందే మళ్లీ భూప్రకంపనలు రావడంతో ప్రజలు భీతిల్లారు. గురువారం మధ్యాహ్నం 2.58 గంటల సమయంలో గన్నవరం ఎయిర్‌పోర్టు, కేసరపల్లి, ముస్తాబాద, పురుషోత్తపట్నం, దావాజీగూడెం, బుద్ధవరం, చిన్నఅవుటపల్లి, తెంపల్లి, వీరపనేనిగూడెం, తదితర గ్రామాల్లో భూమి కంపించినట్లు ఆయా గ్రామ ప్రజలు తెలిపారు. ఎయిర్‌పోర్టులో స్వల్ప భూప్రకంపనలు చోటు చేసుకోవడంతో అధికారులు బయటకు పరుగులు తీశారు. భూప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.1 గా ఉందని, అదే 7కు పెరిగితే పెను ప్రమాదం సంభవిస్తుందని ఇండియా మెటీరియోలాజికల్ డిపార్ట్‌మెంట్ (ఐఎండి) అధికారులు తెలిపారు. భూ ప్రకంపనల ధాటికి స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పైకప్పు పెచ్చులు ఊడి పడగా, పిన్నమనేని సిద్ధార్థ వైద్య కళాశాలలో గోడలు బీటలు వారాయి. స్రవంతి హైస్కూల్‌లో భూప్రకంపనల వల్ల సంభవించిన శబ్దానికి భయపడి, పిల్లల్ని మేడపైనుండి కిందికి దించినట్టు ప్రిన్సిపాల్ కె.రామకృష్ణ తెలిపారు. భూప్రకంపనలపై అవగాహన కల్పించినట్లు ఆయన చెప్పారు.

చిత్రం..భూ ప్రకంపనలకు పిన్నమనేని సిద్ధార్థ వైద్య కళాశాలలో బీటలు వారిన గోడలు