ఆంధ్రప్రదేశ్‌

యాంటీ బయోటిక్స్‌కు దూరంగా ఉందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, అక్టోబర్ 12: ‘రొయ్యతో ఉన్న అనుబంధాన్ని తెంపుకోవద్దు.. యాంటిబయోటిక్స్‌కు దూరంగా ఉండి, మన రొయ్యను రక్షించుకుందాం’ అని ఆక్వా రైతులు, ఎగుమతిదారులు, ప్రాసెసింగ్ యూనిట్లు, హ్యాచరీల నిర్వాహకులు ముక్తకంఠంతో ప్రతినబూనారు. చేపలు, రొయ్యల సాగుకు
ప్రభుత్వం ప్రకటించే విధానానే్న ఏ అనుసరించాలని నిర్ణయించారు. రొయ్యల సాగులో యాంటిబయోటిక్స్ ప్రభావంపై ఆక్వా రైతులకు అవగాహన సదస్సును భీమవరంలో గురువారం ఆంధ్రప్రదేశ్ మత్య్సశాఖ ఏర్పాటుచేసింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన మత్య్సశాఖ కమిషనర్ రమాశంకర్ నాయక్ మాట్లాడుతూ యురోపియన్ యూనియన్ దేశాలు యాంటీబయోటిక్స్ అవశేషాలుంటున్నాయని ఆంధ్రప్రదేశ్ నుంచి ఎగుమతి చేస్తున్న రొయ్యలను వెనక్కి పంపేస్తున్నాయని తెలిపారు. దీనివల్ల రాష్ట్రానికి చెడ్డపేరు వస్తోందన్నారు. ఆక్వాసాగుపై త్వరలో భారత ప్రభుత్వం కొరియా దేశంతో ఒప్పందం చేసుకోనుందని ఆ నేపథ్యంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుందన్నారు. రొయ్యల ఉత్పత్తిదార్ల సంఘం నాయకులు ఐపిఆర్ మోహన్‌రాజు మాట్లాడుతూ తమిళనాడులో మత్య్సశాఖకు రూ.1200 కోట్లు, తెలంగాణలో రూ.1000 కోట్లు బడ్జెట్ కేటాయిస్తుండగా, ఆంధ్రప్రదేశ్‌లో కేవలం రూ.300 కోట్లు కేటాయించడం దారుణమన్నారు. ఎంపెడ పనితీరుపై అసహనం వ్యక్తంచేశారు. ఆక్వా రైతులు చెరువుల వద్ద నిద్రలేని రాత్రులు గడుపుతుంటే ప్రభుత్వం, ఎంపెడా కనీసం ఏమిచెయ్యడం లేదన్నారు. ఆనంద గ్రూప్ చైర్మన్ ఉద్దరాజు కాశీ విశ్వనాధరాజు, ఇర్రింకి సూర్యారావు, గాదిరాజు సుబ్బరాజు, మత్స్యశాఖ జెడి అంజలి, డిడి ఫణిప్రకాష్ తదితరులు సదస్సులో పాల్గొన్నారు.