ఆంధ్రప్రదేశ్‌

అవినీతి పాలనను ఎండగడతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 12: ఆంధ్రప్రదేశ్‌లో నవంబర్ 2 నుంచి ప్రారంభిస్తున్న వైఎస్‌ఆర్‌సిపి అధినేత వైఎస్ జగన్ పాదయాత్ర తెలుగు దేశం పార్టీ నేతల వెన్నులో వణుకుపుట్టిస్తోందని ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. ఎన్నికలకు ముందు బాబు వస్తే జాబు వస్తుందని అన్నారు, ఇప్పుడు బాబు వచ్చాక నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరిగాయని తెలిపారు. యువత ఆత్మహత్యలకు సిఎం చంద్రబాబునాయుడే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. గురువారం నాడిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ పాదయాత్ర చేస్తే టిడిపి భండారం బయటపడుతుందని అన్నారు. అవినీతి పాలనను ప్రజా క్షేత్రంలో జగన్ ఎండగడతారని తెలిపారు. ప్రత్యేక హోదా వచ్చే వరకు వైఎస్‌ఆర్‌సిపి పోరాడుతూనే ఉంటుందని అన్నారు. వైఎస్ జగన్‌పై నమోదైన కేసులన్నీ రాజకీయ కక్షలతోనే నమోదు చేసినవి తప్ప వాస్తవం కాదని అన్నారు. ఆనాడు వైఎస్ చనిపోయిన తర్వాత జగన్ పాదయాత్ర చేపడుతుంటే, ఆ సందర్భంగా వస్తున్న ప్రజా స్పందన చూసి తట్టుకోలేక కాంగ్రెస్‌తో కుమ్మక్కై రాజకీయ కోణంలో పెట్టించిన కేసులు మాత్రమేనని ఆయన వివరణ ఇచ్చారు. అవాస్తవాలను వాస్తవాలుగా చూపేందుకే జగన్‌పై కేసుల అస్త్రాన్ని ప్రయోగించారని తెలిపారు. ఆనాడు అన్యాయంగా బలి చేసిన ఐఏఎస్, ఐపిఎస్‌లు ఒక్కొక్కరు డిస్‌చార్జ్ పిటీషన్లు వేసుకుని బయటపడుతున్నారని అన్నారు. న్యాయస్థానాలు నిర్ధోషులను దోషులుగా చిత్రీకరించ లేవని తెలిపారు. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ ఎంతో దోచుకున్నారని, వారు అవినీతి పరులు కాదా అని ప్రశ్నించారు. ఏనాడు సచివాలయం మెట్లు ఎక్కని జగన్, మంత్రి పదవి నిర్వహించని ఆయన ఏ రకంగా కోట్లు ఆర్జించారని ప్రశ్నించారు.