ఆంధ్రప్రదేశ్‌

ఈదురుగాలుల బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మే 26: తూర్పు గోదావరి జిల్లాలో ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. గురువారం సాయంత్రం వరకు ఎండలు భగభగలాడగా, ఒక్కసారిగా వాతావరణం మారింది. జిల్లా అంతటా భారీ ఈదురుగాలులు వీచాయి. జిల్లాలో అత్యధికంగా 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా, సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై భారీ ఈదురుగాలులు వీచాయి. దీనితోపాటు భారీ వర్షం కురిసింది. రంగంపేట, రాజానగరం మండలాల్లో వందలాదిగా భారీ వృక్షాలు నేలకూలాయి. ఎడిబి రోడ్డులోని రంగంపేట వద్ద పదుల సంఖ్యలో చెట్లు కూలిపోవడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది.
రాజమండ్రి - కాకినాడ మధ్య తిరిగే నాన్-స్టాప్ సర్వీసులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రాజమహేంద్రవరంలో భారీ వర్షం, భారీ ఈదురుగాలులు వీచడంతో విద్యుత్ స్తంభాలు ఒరిగిపోయి, వైర్లు తెగిపడ్డాయి. హోర్డింగ్‌లు, చెట్లు కూలిపోవడంతో దాదాపు 10 కార్లు వరకు ధ్వంసమయ్యాయి. జిల్లా అంతటా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రోజంతా భీకర వడగాల్పులు. ఆపై ఈదురుగాలుల బీభత్సం సృష్టించాయి. గండేపల్లి, రంగంపేట, రాజానగరం, జగ్గంపేట, శంఖవరం, తుని, కోటనందూరు, రౌతులపూడి, పిఠాపురం, గొల్లప్రోలు, రాజమండ్రి అర్బన్ మండలాల్లో భారీ ఈదురుగాలులు వీచాయి. వీధుల్లో వాహనాల రాకపోకలు స్తంభించడంతో పరిస్థితి బీభత్సంగా మారింది.

chitram రాజమహేంద్రవరంలో చెట్టుకూలి ధ్వంసమైన కారు