ఆంధ్రప్రదేశ్‌

ఆదాయం పెంపుపై దృష్టి సారించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 12: వ్యాపారులను ఇబ్బందులకు గురి చేయకుండా ఆదాయాన్ని పెంచే విధంగా వాణిజ్య పన్నుల శాఖ అధికారులు పనిచేయాలని రాష్ట్ర ఆర్థిక, వాణిజ్య పన్నులు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. విజయవాడ కానూరులో గురువారం వాణిజ్య పన్నుల శాఖ రాష్ట్ర స్థాయి సమీక్ష సమావేశం, ప్రశంసాపత్ర పురస్కారోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ పురస్కారాలు అందుకున్న ఉద్యోగులపై మరింత బాధ్యత పెరుగుతుందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోను పోటీ ఉందన్నారు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో 11 శాతం వృద్ధి రేటును సాధించామని మంత్రి తెలిపారు. వాణిజ్య పన్నుల శాఖ 40 వేల కోట్ల రూపాయలు ఆదాయాన్ని సమకూర్చుకోవాలనే లక్ష్యాలలో 44 శాతం సాధించామని, పూర్తిశాతం సాధించే బాధ్యత అధికారులపై ఉందని అన్నారు. జిల్లా కలెక్టర్లతో వాణిజ్య పన్నుల శాఖాధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు. రాష్టవ్య్రాప్తంగా అన్ని జిల్లాలలో వాణిజ్య పన్నుల శాఖ ప్రధాన కార్యాలయాలు ఏర్పాటుకు జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకొని నిర్మాణాలకు, వాటికి అవసరమైన నిధులను మంజూరుకు చర్యకు తీసుకుంటామన్నారు. వాణిజ్య పన్నుల శాఖపై బడ్జెట్ ఆధారపడి ఉంటుందన్నారు. శాఖలో ఖర్చుల శాతాన్ని ప్రస్తుతం ఒక శాతం ఖర్చు పెడుతున్నారని దానిని అర శాతానికి తీసుకురావాలన్నారు. ప్రపంచ వ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గిన నేపథ్యంలో పెట్రోలు, డీజిల్‌పై పన్ను తగ్గించే యోచన పరిశీలనలో ఉందన్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా, అదే సమయంలో రెవెన్యూ తగ్గకుండా పన్నులను వసూలు చేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ప్రధాన కమిషనర్ శ్యామలరావు మాట్లాడుతూ వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు సవాల్‌గా తీసుకుని పనిచేయాలని, 50 శాతం పన్నుల వసూళ్లు సరాసరిలో గత మూడు సంవత్సరాలలో 44 శాతమే సాధించామని, 6 శాతం గ్యాప్‌ను పూరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వాణిజ్య పన్నుల శాఖ కార్యకలాపాలను పూర్తిస్థాయిలో ఆన్‌లైన్ ద్వారా కంప్యూటరీకరించామన్నారు. ఆడిటింగ్‌ను తగ్గించవలసిన అవసరం ఉందని, అదే సమయంలో ఆడిటింగ్‌లో క్వాలిటీ ముఖ్యం అన్నారు. చెక్‌పోస్టులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని, పటిష్ట నిర్వహణతో 40 కోట్ల రూపాయలు పన్నులు వసూలు చేశామన్నారు. జీఎస్టీ విధాన నిర్ణయంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ ఉత్తమ ప్రతిభ కనపర్చిన స్టేట్ ట్యాక్స్ విధానంలో కమిషనర్ ఆఫ్ కమర్షియల్ టాక్స్ ఆఫీసులో కమిషనర్ టి.రమేష్‌బాబు, అడిషనల్ కమిషనర్ యు.ఏడుకొండలు, జాయింటు కమిషనర్లు జెవిఎం శర్మ, ఎస్.శేఖర్, డెప్యూటీ కమిషనర్లు జి.ఓంకార్ రెడ్డి, ఎం.రాంబాబు, జి.కల్పనతో పాటు సంబంధిత విభాగాల్లో దాదాపు 90కి పైగా ప్రశంసా పత్రాలను మంత్రి యనమల అందజేశారు.