ఆంధ్రప్రదేశ్‌

సాంకేతికతను సద్వినియోగం చేసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, అక్టోబర్ 12: ఆధునిక సాంకేతికతను సద్వినియోగం చేసుకోవడంతోపాటు దాన్ని కాపాడుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు యువతకు ఉద్బోధించారు. కాలానుగుణంగా వస్తున్న సాంకేతికతను అందిపుచ్చుకోవడం ఎంత అవసరమో దాన్ని అభివృద్ధి కోసం వినియోగించుకోవడం కూడా అంతే అవసరమని ఆయన స్పష్టం చేశారు. విజయవాడ ఎ కనె్వన్షన్ సెంటర్‌లో గురువారం ఉదయం రామినేని ఫౌండేషన్ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్‌తో కలిసి పురస్కార గ్రహీతలను సత్కరించారు. చంద్రబాబు మాట్లాడుతూ సాంకేతికత ఎంత పెరిగినా మానవ విలువలను కాపాడుకోవాలని అభిప్రాయపడ్డారు. సాంకేతికతకు బానిసగా మారితే చాలా సమస్యలు వస్తాయని, ఇప్పటికే అందరూ యాంత్రిక జీవులుగా తయారవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ వ్యవస్థ బలంగా ఉన్న దేశం భారత్ అని, దాన్ని ఎవరూ విస్మరించరాదని చెప్పారు. జనాభాను నియంత్రించుకుంటూ పోతే యువజనుల శాతం తగ్గిపోయే ప్రమాదం ఉందన్నారు. గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేయడం ద్వారా దేశంలో ఒక నూతన అధ్యాయానికి తెరతీశామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రామినేని ఫౌండేషన్ అనేక సంవత్సరాలుగా సమాజంలోని వేర్వేరు రంగాల్లో వెలుగొందుతున్న ప్రముఖ వ్యక్తులను గుర్తించి వారిని పురస్కారాలతో గౌరవిస్తూ ఒక ఉత్తమ సంప్రదాయాన్ని నెలకొల్పిందని ఆయన ప్రశంసించారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ కెవి చౌదరికి ముఖ్యమంత్రి విశిష్ట పురస్కారాన్ని అందించారు. హైదరాబాద్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడికల్ సైనె్సస్ డీన్ ప్రొఫెసర్ గీతా వేముగంటి, ప్రముఖ నటుడు ఆర్ నారాయణమూర్తి, తెలుగు రంగస్థల నటుడు ఆర్ నాగేశ్వరరావు (సురభి బాబ్జి)లకు విశేష పురస్కారాలు అందించారు. కెవి చౌదరి ఉద్యోగ జీవితం నేటితరానికి ఎంతో ఆదర్శప్రాయమని ముఖ్యమంత్రి అన్నారు. నమ్మిన సిద్ధాంతాల కోసం రాజీపడని మనస్తత్వం ఆర్ నారాయణ మూర్తిదని ఆయన చెప్పారు. స్టెమ్ సెల్ థెరపీలో డాక్టర్ గీత జరిపిన పరిశోధనలు అంతర్జాతీయంగా ఆమెకు ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టిందని చెప్పారు. నాటక రంగానికి సురభి బాబ్జి చేస్తున్న విశే కృషిని గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పుస్కారాన్ని అందించిందని గుర్తు చేశారు.
ఏపి ప్రజలు కష్టజీవులు: పారికర్
ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు రామినేని ఫౌండేషన్ ప్రతినిధులకు గోవా సిఎం పారికర్ ధన్యవాదాలు తెలిపారు. దేశంలో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, గోవా రాష్ట్రానికి కొన్ని విషయాలలో సారూప్యాలు ఉన్నాయని తెలిపారు. తగినంత మంచినీరు, వరి పంట పండే పచ్చటి పొలాలు, విస్తారంగా కొబ్బరి చెట్లు, పుష్కలంగా చేపలు తదితరమైనవి ప్రజలకు విరివిగా అందుబాటులో ఉన్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు చాలా బాగా కష్టించి పనిచేస్తారని, తమ రాష్ట్రంలో అలాంటి వాతావరణం లేదని ఆయన తెలిపారు. పాతూరి నాగభూషణం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు గంటా శ్రీనివాసరావు, పత్తిపాటి పుల్లారావు, ఫౌండేషన్ చైర్మన్, ధర్మ ప్రచారక్ రామినేని, డిజిపి సాంబశివరావు, తెలుగు రాష్ట్రాల ఐటి శాఖ ముఖ్య కమిషనర్లు కె.శ్యాంప్రసాద్ చౌదరి పాల్గొన్నారు.

చిత్రం..రామినేని ఫౌండేషన్ పురస్కారాల ప్రదానోత్సవాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు