ఆంధ్రప్రదేశ్‌

చిత్తూరు, అనంత, విశాఖలో ఎలక్ట్రానిక్స్ క్లస్టర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 16: ఎలక్ట్రానిక్స్ తయారీరంగ అభివృద్ధికి క్లస్టర్ మోడల్‌ను సిద్ధం చేయాలని ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. అందులో భాగంగా అనంతపురం, విశాఖ, చిత్తూరులో ఎలక్ట్రానిక్ తయారీ క్లస్టర్లను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. సోమవారం మంత్రి లోకేష్ ఎలక్ట్రానిక్స్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం అభివృద్ధిపై చర్చించారు. ఇతర దేశాలు, రాష్ట్రాల్లో ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం అభివృద్ధి కోసం తీసుకున్న చర్యలు, అమలు చేస్తున్న పాలసీలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం మన దేశంలో 100 బిలియన్ డాలర్ల ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల డిమాండ్ ఉంది. అందులో 40 బిలియన్ డాలర్ల ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు మాత్రమే మనదేశంలో తయారవుతున్నాయి. మిగిలిన 60 బిలియన్ డాలర్ల ఉత్పత్తులు ఇతర దేశాల నుండి దిగుమతి అవుతున్నాయి. దిగుమతి అవుతున్న ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల్లో మెజారిటీ 57 శాతం చైనా నుండి జరుగుతున్నాయని మంత్రికి వివరించారు. ఇతర దేశాల్లోనూ, రాష్ట్రాల్లోనూ ప్రస్తుతం ఉన్న పాలసీలను స్టడీ చేసి, ఎలక్ట్రానిక్స్ తయారీరంగ కంపెనీలను ఆకర్షించే విధంగా నూతన పాలసీలు తయారుచేయాలని మంత్రి ఆదేశించారు. ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, ఎక్స్‌పోర్ట్స్‌పై రాయితీలు ఇస్తూ నూతన విధానం రూపొందించాలని సూచించారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే విధంగా శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలన్నారు. కాగా ఉపాధి హామీ పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ బకాయిలు రూ.337 కోట్లు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వానికి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధి హామీ పథకంలో అవకతవకలు జరుగుతున్నాయని ప్రతిపక్ష పార్టీ ఎంపీలు లేఖలు రాసి పేద ప్రజలకు వేతనాలు రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. ఉపాధి హామీ పథకంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలుచేస్తున్న ఆడిటింగ్ పద్ధతులు, కేంద్ర ప్రభుత్వం అడిగిన వివరాలను అందించామన్నారు.
మెరుగైన పాలన కోసమే ఈ ప్రగతి
పరిపాలనలో సాంకేతిక అమలును మరింత పటిష్టం చేసేందుకు ఈ ప్రగతి ఏర్పాటు చేసినట్లు లోకేష్ చెప్పారు. దీంతో ప్రభుత్వ ఆన్‌లైన్ సేవలు అనుసంధానమవుతాయన్నారు. ఈ ప్రగతి కోర్ ప్లాట్‌ఫాం నిర్వహణ ఈవై సంస్థకు అప్పగించామన్నారు. డేటా ఎనలిటిక్స్ ద్వారా సిఎం కోర్ డ్యాష్ బోర్డును ఈ సంస్థ అప్‌డేట్ చేస్తుందని ఆ తరహాలో ఏర్పాటుకానున్న ఈ ప్రగతి కోర్ ప్లాట్‌ఫాం ప్రజలకు ఉపయోగపడుతుందన్నారు. దీంతో సర్ట్ఫికెట్ల కోసం ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని, వచ్చే ఏడాది మార్చి నాటికి ఈ ప్రాజెక్టును పూర్తిచేస్తామని లోకేష్ చెప్పారు.