ఆంధ్రప్రదేశ్‌

నిర్వాసితుల నోట్లో మన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), అక్టోబర్ 17: పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం చేపడితేనే సకాలంలో పూర్తవుతుందని పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి పేర్కొన్నారు. ప్రాజెక్టుల నిర్వాసితులకు న్యాయం చేయాలంటూ వామపక్షాల ఆధ్వర్యంలో నగరంలోని ధర్నాచౌక్‌లో ఆందోళన చేపట్టిన నిర్వాశితులకు కాంగ్రెస్ తరఫున మద్దతు ప్రకటించిన రఘువీరారెడ్డి మాట్లాడుతూ ప్రాజెక్టుల పేరుతో కోట్లు కుమ్మరిస్తున్న టిడిపి ప్రభుత్వం కాంట్రాక్టర్లకు ప్రయోజనం చేస్తుందే కానీ, నిర్వాసితులకు మాత్రం అన్యాయం చేయడం గర్హనీయమన్నారు. సోమవారాన్ని పోలవరంగా మార్చానని చెప్పుకుంటున్న సిఎం చంద్రబాబు ప్రాజెక్టు నిర్మాణంలో అనుసరిస్తున్న వైఖరితో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయన్నారు. చట్ట ప్రకారం పోలవరాన్ని కేంద్రమే నిర్మించాల్సి ఉండగా చంద్రబాబు అందుకు వ్యతిరేకంగా వ్యవహరించిన కారణంగానే పలు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడితే పోలవరం ఎప్పటికీ పూర్తికాదని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా లేకుండా చంద్రబాబు ఎన్ని దేశాలు తిరిగినా పరిశ్రమలు రావని, రాష్ట్రానికి హోదా వస్తే చంద్రబాబు ఇంట్లో పడుకున్నా పరిశ్రమలు తరలివస్తాయని పేర్కొన్న రఘువీరారెడ్డి పోలవరం, హోదా విషయాల్లో చంద్రబాబు ఇకనైనా తన పంథా మార్చుకోవాల్సిన అవసరం ఉందని హితవుపలికారు.
దివంగత ప్రధాని ఇందిరాగాంధీ ఆలోచనలే నేటి కాంగ్రెస్‌కు మార్గదర్శకమని, దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన ఇందిరమ్మ చేసిన సేవలు, అభివృద్ధి పథకాల ప్రచారంతోనే కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని రఘువీరారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఉదయం నగరంలోని ఎపిసిసి కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉక్కు మహిళగా ప్రఖ్యాతిగాంచిన ఇందిరాగాంధీ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఆక్టోబర్ 31వ తేదీ నుంచి నవంబర్ 19వ తేదీవరకూ శత జయంతి ఉత్సవాలను అన్ని స్థాయిల్లోనూ ఘనంగా నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించామన్నారు. నవంబర్ 5వ తేదీన జిల్లా, నగర కేంద్రాల్లో ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు ఇందిరమ్మ సేవలపై పోటీ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. అక్టోబర్ 31, నవంబర్ 19న ఇందిరమ్మ విగ్రహాలకు పూల మాలాలంకరణలు, అన్ని మండల కేంద్రాలు, పట్టణ, డివిజన్లలో ఇందిరాగాంధీ చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలపై భారీ ఫ్లెక్సీల ఏర్పాటు, ప్రతి నియోజకవర్గంలో ఇందిర ప్రచార రధం ఏర్పాటు, అన్నదానాలు, రక్తదానం, పుస్తకాలు, వస్త్రాల పంపిణీ చేస్తామన్నారు. రాష్ట్రంలో పలు చోట్ల వివిధ సదస్సులను నిర్వహించడంతోపాటు నవంబర్ 18వ తేదీన చిత్తూరు జిల్లా మదనపల్లిలో రాష్ట్ర స్థాయి ఇందిరమ్మ శత జయంతి ఉత్సవాల ముగింపుగా భారీ బహిరంగ సభ జరుగుతుందని వివరించారు.

చిత్రం..నిర్వాశితుల ధర్నాలో మాట్లాడుతున్న పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి