ఆంధ్రప్రదేశ్‌

దీక్ష,దక్షత విశాఖ సొంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 17: విశాఖను ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. 113 కోట్ల రూపాయలతో విశాఖలో రోటరీమోడ్ సెపరేటర్ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించనున్న రెండస్థుల ఫ్లైఓవర్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వంతెనను 18 నుంచి 24 నెలల్లో నిర్మించాలని కాంట్రాక్టర్లకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు.
ఇక్కడ ఫ్లైఓవర్ లేకపోవడం వలన ట్రాఫిక్ సమస్యతో విశాఖ వాసులు అల్లాడిపోయారని అన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించేందుకు ఈ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని చేపడుతున్నామని ఆయన తెలియచేశారు. దేశంలో ఇంజనీరింగ్ డీటైల్స్‌కి ఈ వంతెన ఒక ప్రయోగంగా నిలవనుందని చంద్రబాబు చెప్పారు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయితే, భారీ వాహనాలు సైతం ఎక్కడా ఆగకుండా వెళ్లిపోతాయని అన్నారు. హుదూద్ తుఫాన్ విశాఖ నగరాన్ని చిన్నాభిన్నం చేసిందని, విశాఖ వాసులు ఆత్మస్థైర్యం, ప్రభుత్వం చూపిన చొరవకు ఆ తుపాను సిగ్గుపడిందని చంద్రబాబు అన్నారు.
విశాఖ వాసుల మంచితనం, అకుంఠిత దీక్షతో నగరంలో ఎక్కడ చూసినా పచ్చదనం వెల్లి విరిస్తోందని ఆయన అన్నారు. ఎటువంటి తుపానులైనా తట్టుకునేందుకు విశాఖలో అండర్‌గ్రౌండ్ విద్యుత్ లైన్లను ఏర్పాటు చేస్తున్నామని ఆయన చెప్పారు. ప్రభుత్వంలో పనులు వేగంగా జరిగేందుకు ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 1100ను అందరూ ఉపయోగించుకోవాలన్నారు. మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, గంటా శ్రీనివాసరావు, ఎంపి అవంతి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు గణబాబు, వెలగపూడి, పల్లా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజు, పీలా గోవింద్, పంచకర్ల రమేష్‌బాబు, బండారు సత్యనారాయణ మూర్తి, ఎమ్మెల్సీలు పప్పల చలపతిరావు, మాధవ్, ఎంవివిఎస్ మూర్తి, మాజీ ఎమ్మెల్యే రెహమాన్, కలెక్టర్ ప్రవీణ్ కుమార్, వుడా విసి బసంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..ఎన్‌ఎడి ఫ్లైఓవర్ నమూనాను పరిశీలిస్తున్న చంద్రబాబు