ఆంధ్రప్రదేశ్‌

గ్రామాల్లో ఇక కల్లు అంగళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయవరం, అక్టోబర్ 20: పాలకేంద్రాల మాదిరిగానే గ్రామాల్లో కల్లు అంగళ్లు ఏర్పాటుచేయాలని యోచిస్తున్నామని రాష్ట్ర కల్లుగీత కార్మికుల కార్పొరేషన్ ఛైర్మన్ టి జయప్రకాష్ నారాయణగౌడ్ తెలిపారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రాయవరం మండలం కురకాళ్లపల్లి వచ్చిన ఆయన విలేఖర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో కల్లును నిల్వ చేయడానికి చిల్లింగ్ యూనిట్లు ఏర్పాటుచేసే అలోచన ఉందన్నారు. రాష్ట్రంలో 2194 కల్లుగీత సొసైటీలు ఉండగా, సుమారు 1.05 లక్షల మంది కార్మికులున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్‌కు రూ.70 కోట్లు కేటాయించిందన్నారు. గీత కార్మికుల అభివృద్ధికి పలు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందులో భాగంగా నాలుగువేల మంది కార్మికులకు బెల్లం ఉత్పత్తులపై శిక్షణ ఇస్తున్నామని, వెయ్యి మంది మహిళలకు కుట్టుశిక్షణ ఇచ్చి వారికి ఉచితంగా మిషన్లు అందచేస్తామన్నారు. వివిధ రకాల నైపుణ్యాలపై వెయ్యి మంది యువతకు శిక్షణ ఇస్తున్నామన్నారు. వారికి 50శాతం సబ్సిడీపై రెండు లక్షల వంతున రుణాలు అందిస్తామన్నారు. విదేశాల్లో చదువుకునే గీతకార్మికుల పిల్లలకు యాభై శాతం సబ్సిడీపై రూ.20 లక్షలు అందజేస్తామన్నారు.