ఆంధ్రప్రదేశ్‌

మీరు ఒంటరి కాదు.. నేనున్నాను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, అక్టోబర్ 21: ‘మీరు ఒంటరి కాదు. మీ వెనుక ఒక రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మీ వెనుక చంద్రబాబునాయుడున్నాడు. దుబాయిలో ఎన్నార్టీ మీటింగ్ చరిత్రకు నాంది పలకాలి. మీరంతా ఏపి ఎన్నార్టీతో అనుసంధానం కండి. గల్ఫ్ దేశాల్లో ప్రవాసాంధ్రులకు మూడు పథకాలు తెస్తాం. స్కిల్ డెవలెప్‌మెం ట్ ఇస్తాం. మీకు సంకల్పం ఉంటే ఇప్పుడు సంపాదించిన దానికంటే రెండు మూడు రెట్లు ఎక్కువ ఆదాయం తీసుకువచ్చేలా తయారుచేస్తా’నని సిఎం చంద్రబాబునాయుడు దుబాయ్‌లోని తెలుగువారికి పిలుపునిచ్చారు.
శనివారం ఆయన దుబాయ్ నాన్ రెసిడెంట్ తెలుగూస్ (ఎన్‌ఆర్‌టి) ఏర్పాటుచేసిన సదస్సు లో ప్రసంగించారు. ఈ సందర్భంగా బాబు గల్ఫ్‌లో నివసిస్తున్న తెలుగువారికి అభయం ఇచ్చారు. త్వరలో మీకోసం మూడు పథకాలు ప్రవేశపెట్టనున్నామన్నారు. ప్రపంచంలో 25 లక్షల ఎన్నార్టీలున్నారని, మీరు కూడా వారితో అనుసంధానం కావాలని పిలుపునిచ్చారు. అమరావతి నుంచి ఎమిరేట్స్ నుంచి నేరుగా విమానం వస్తుందని, అన్ని ప్రాంతాలకు దాన్ని కనెక్టు చేస్తున్నామని వెల్లడించారు. ‘తెలుగువారు ఉన్నంత వరకూ తెలుగువారి గుండెల్లో ఎన్టీఆర్ చిరస్థాయిగా ఉంటారు, మనవాళ్లు ఎక్కడ ఉన్నా రాణిస్తారు. రాష్ట్రంలో వ్యాపారాలు చేయాలంటే పూర్తిగా సహకరిస్తాం. మీకు ఎన్నార్టీ, రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది. ప్రవాసాంధ్రుల సంక్షేమానికి రూ.40కోట్ల ప్రత్యేక నిధి ఏర్పాటు చేశారు. ‘నంద్యాల మ నం ఓడిపోయిన సీటు గెలిచాం. రాజకీయంగా నూటికి 80 శాతం తెలుగుదేశం పార్టీనే ఉండాలి. అభివృద్ధికి సుస్థిర ప్రభుత్వం ఉండాలి. మీరు కూడా నా ఉద్దేశాన్ని అర్ధం చేసుకుని సహకరించండి. అధికారంలోకి రాగానే ఏపిఎన్‌ఆర్‌టిని నెలకొల్పామని, గల్ఫ్‌లో ఉన్న ఆంధ్రుల సమస్యలను గుర్తించి అధ్యయనం చేయమని కోరానని, వాళ్ల సమస్యల పరిష్కారానికి సూచనలు అడిగానని చెప్పారు. మీలో అనేకమంది ఏపిఎన్‌ఆర్‌టితో కలిసి పనిచేస్తున్నారన్నారు. ఇలా ఏపిఎన్‌ఆర్‌టిలో 109 దేశాల నుంచి 45వేల మంది సభ్యులయ్యారన్నారు. సమస్యల పరిష్కారానికి, సమస్యల నిరోధానికి ఏపిఎన్‌ఆర్‌టి ఒక వేదికగా నిలిచిందన్నారు. విదేశాల్లో ఉన్న మన రాష్ట్రం వారు దురదృష్టవశాత్తూ సమస్యల్లో ఉన్నా, ఆపదల్లో చిక్కుకున్నా వారికి తక్షణ సాయానికి బడ్జెట్‌లో రూ.40 కోట్లను కేటాయించామని వెల్లడించారు. ప్రవాసాంధ్ర హెల్ప్‌లైన్ పేరుతో 24 గంటలూ సేవలందించే ఒక హెల్ప్‌లైన్ ప్రారంభించాలని ఏపిఎన్‌ఆర్‌టికి సూచించామన్నారు. ‘ప్రవాసాంధ్ర భరో సా’ పేరుతో ఒక బీమా పథకం తీసుకొచ్చాం. దురదృష్టవశాత్తూ చనిపోయినా, ప్రవాదవశాత్తూ గాయపడినా, వైకల్యం సంభవించినా, జబ్బులు వచ్చినా, న్యాయపరమైన చిక్కులు ఎదురైనా ఆదుకుంటున్నాం. మైగ్రెంట్స్ కేవలం ఏడాదికి రూ.50 ప్రీమియం చెల్లిస్తే చాలు. మిగతాది ప్రభుత్వం చెల్లిస్తుంది. చనిపోతే రూ.10లక్షల బీమా, లక్ష వరకు ఆరోగ్య బీమా, లీగల్ ఇన్స్యూరెన్స్ కింద రూ.45వేలు అందిస్తున్నాం. ఇక్కడ నివసించే మన రాష్ట్ర మహిళలకు మెటర్నిటీ బెనిఫిట్స్ అందిస్తున్నాం. ఇక్కడికి వలస వచ్చిన వారిని అత్యవసరంగా సహాయం అందించేందుకు ‘ప్రవాసాంధ్ర నిధి’ ఏర్ప ర్చాం. ఇక్కడ ఉన్న మన వాళ్ల నైపుణ్యాలు మెరుగుపర్చేందుకు మైగ్రెంట్ ఎకనమిక్ రిహాబిలిటేషన్ సెంటర్ స్థాపిస్తున్నాం. ఇక్కడికి వచ్చి సంపన్నులైన వారు జన్మభూమికి సహాయపడవచ్చు. వ్యాపార అనుకూలత కలిగిన రాష్ట్రాల్లో భారత్‌లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రపంచ బ్యాంక్ నెంబర్-1 ర్యాంక్ ఇచ్చిందని బాబు వివరించారు.

చిత్రం..దుబాయ్‌లో ఎన్‌ఆర్‌టి సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు