ఆంధ్రప్రదేశ్‌

వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకొని చిరుత మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పీలేరు, అక్టోబర్ 21: చిత్తూరుజిల్లా పీలేరు అటవీశాఖ రేంజ్ పరిధిలో రొంపిచెర్ల బీటు పరిధిలో కమ్మోళ్లకొండ అటవీప్రాంతంలో ఒక ఆడ చిరుతపులి వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకొని మరణించిందని పీలేరు అటవీక్షేత్ర అధికారి రామ్‌లా నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిరుతపులి మరణానికి కారకులైన చెల్లావారిపల్లి గ్రామానికి చెందిన చంద్రయ్య కుమారుడు సత్యనారాయణ గత 4 రోజులక్రితం జంతువులకోసం అటవీప్రాంతంలో ఉచ్చులు ఏర్పాటుచేశారు. ఆ దారిలో వెళ్లిన చిరుతపులి వేటగాళ్లు వేసిన ఉచ్చులో తగులుకొని మృతిచెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శనివారం యథావిధిగా పశుకాపరులు పశువులను తోలుకొని కమ్మోళ్ల కొండ ప్రాంతానికి వెళ్లగా వేటగాళ్లు వేసిన ఉచ్చులో చిక్కుకొని చిరుతపులి మరణించినట్లు గుర్తించి స్థానిక అటవీశాఖాధికారులకు సమాచారం ఇవ్వగా పీలేరు ఫారెస్ట్‌రేంజర్ రామ్‌లా నాయక్ హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకొని పరిసరాలను పరిశీలించి వేటగాని ఉచ్చుకు చిక్కుకుని చిరుతపులి మరణించినట్లు నిర్దారించుకున్నారు. తిరుపతి జూపార్క్ వన్యమృగాల డాక్టర్లకు సమాచారం ఇచ్చి మృతి చెందిన చిరుతపులికి సంఘటనా స్థలంలో పంచనామా నిర్వహించి కళేబరాన్ని అటవీ, రెవెన్యూ అధికారుల సమక్షంలో కాల్చివేశారు. చిరుత మృతికి కారకుడైన సత్యనారాయణను అదుపులోకి తీసుకొని కేసు నమోదుచేసి రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు.