ఆంధ్రప్రదేశ్‌

అరటి నారతో వస్త్రాల తయారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోని, అక్టోబర్ 21: అరటి నార, ఖాదీ నూలుతో ప్రయోగాత్మకంగా వస్త్రాలు తయారు చేసినట్లు ఖాదీ గ్రామీణ పరిశ్రమల దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ చైర్మన్ చంద్రవౌళి పేర్కొన్నారు. కర్నూలు జిల్లా ఆదోనిలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ మహారాష్టల్రోని జల్గాం పట్టణంలో అరటి నార, ఖాదీనూలు కలిపి వస్త్రాన్ని తయారు చేశామన్నారు. త్వరలోనే మార్కెటెలోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రపంచంలో 12 దేశాలు అరటి చెట్ల వల్ల అధిక ఆర్థిక అభివృద్ది సాధించాయని అన్నారు. ఈ పరిశ్రమను అభివృద్ది చేయడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాయలసీమలో కడప జిల్లాలో అరటితోటలు ఎక్కువగా ఉన్నాయని, అక్కడే అరటి నారతో వస్త్రాన్ని తయారు చేసే పరిశ్రమ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఖాదీ పరిశ్రమ గత సంవత్సరం కన్నా 24 శాతం ఆదాయాన్ని అధికంగా సాధించిందని పేర్కొన్నారు. కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలో ఖాది పరిశ్రమకు ఎంతో ప్రాముఖ్యత ఉందని అన్నారు. ఆరోగ్య, రైల్లేశాఖ ఖాదీ వస్త్రాల కొనుగోలుకు ముందుకు వచ్చాయని అన్నారు. ఆరోగ్యశాఖ రూ.150 కోట్లు, రైల్వే శాఖ రూ.55 కోట్లు, ఓఎన్‌జిసి సంస్థ రూ.45కోట్ల విలువ చేసే ఖాదీ వస్త్రాన్ని కొనుగోలు చేయడానికి ఆర్డర్లు ఇచ్చాయని ఆయన తెలిపారు. రాష్ట్ర విభజన తరువాత ఖాదీ పరిశ్రమకు ప్రాధాన్యత ఇచ్చామని చెప్పారు. కర్నూలు, కడప జిల్లాల్లో చేనేత, అనంతపురం జిల్లాలో సిల్క్ పరిశ్రమకు ప్రాధన్యాత ఇచ్చి కార్మికులకు ప్రోత్సాహం అందిస్తున్నామని అన్నారు. ఖాదీ పరిశ్రమలో సాంకేతిక పరిజ్ఞానం పెరగక పోవడం, ఆధునీకరణ చేయకపోవడం వల్ల కొంత వెనుకుబాటు ఉందని అన్నారు. ఆత్మహత్య చేసుకుంటున్న చేనేత కుటుంబాలను ఆదుకునేందుకు ఏడిపి బ్యాంకు రూ.300 కోట్ల రుణాలు మంజూరు చేసిందన్నారు. దేశవ్యాప్తంగా 400 మూతపడిన ఖాదీ పరిశ్రమలను పునరుద్దరించడమే కాకుండా మార్కెటింగ్ సౌకర్యం కోసం ఔట్‌లైట్లు ప్రారంభించామని చెప్పారు. ఆలాగే వర్కింగ్ క్యాపిటల్ కింద రూ.50 లక్షల నుంచి రూ.కోటి కేంద్రం అందిస్తోందన్నారు. ఆంధ్ర, తెలంగాణ, కర్నాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో 102 ఖాదీ పరిశ్రమలకు వర్కింగ్ క్యాపిటల్ ఇచ్చామన్నారు. అందులో భాగంగా రాష్ట్రంలోని 29 సంస్థలకు ఆర్థిక సహాయం అందించామని చెప్పారు. రూ.15 కోట్లతో అనంతపురంలో సిల్క్‌రీలింగ్ కేంద్రం ఏర్పాటు చేశామని, త్వరలో దీన్ని ప్రారంభిస్తామని చెప్పారు. కొత్త పరికరాలు, నూతన ఛరకాలు అందించి సిల్క్ పరిశ్రమ అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. సిల్క్ పరిశ్రమలను ఆధునీకరించి పెద్దపెద్ద పరిశ్రమలతో పోటీ పడుతున్నామన్నారు. ప్రధాన మంత్రి నిరుద్యోగ పథకం కింద రూ.100 కోట్లు గ్రామీణ ఖాదీ పరిశ్రమకు అందుతున్నాయని చంద్రవౌళి తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల్లో చేనేతలను ఆదుకోవడానికి ఖాదీ పంచాయితీ సంస్థలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.