ఆంధ్రప్రదేశ్‌

కోట్లపై కోటి ఆశలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, అక్టోబర్ 21 : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డిపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి ఆశలు పెట్టుకుంది. ఆయన ఏదో ఒకరోజు తమ పార్టీలో చేరడం ఖాయమన్న గంపెడాశతో ఆపార్టీ నేతలు ఉన్నారు. చాలాకాలంగా పార్టీ మారుతున్నారని వస్తున్న ప్రచారాన్ని కోట్ల ఖండిస్తూ వస్తున్నారు. పార్టీ వీడే ప్రశక్తేలేదని ఎన్ని వివరణలు ఇచ్చినా ప్రచారం మాత్రం ఆగడం లేదు. కోట్ల చేరికపై టిడిపి కంటే వైకాపా నేతల్లోనే ఎక్కువ ధీమా కనిపిస్తోంది. నంద్యాల ఉప ఎన్నిక అనంతరం కాంగ్రెస్ పార్టీలో ఆయన కొనసాగలేరని వైకాపా భావిస్తోంది. ఎన్నికల్లో వైకాపా ఓడిన అనంతరం ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పార్టీని వీడనున్నారన్న ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో కర్నూలు ఎంపి బుట్టా రేణుక సైతం పార్టీకి వీడ్కోలు పలికి టిడిపి తీర్థం పుచ్చుకుంటారని వార్తలు వచ్చాయి. అయితే ఇదే వార్తను జగన్ సొంత మీడియాలో మరింత ఎక్కువ వివరాలతో ప్రచురించారు. రేణుక టిడిపి నేతలతో చర్చలు జరిపారని, భారీ ప్యాకేజీ కూడా ఖరారైందని వార్తలు ప్రచురించి ప్రసారం చేసింది. దీంతో ఆమె నాలుగైదు రోజులు ఎవరికీ అందుబాటులో లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ వార్తలు ఇతర పార్టీల నేతల కంటే వైకాపా నేతలనే తీవ్ర అసంతృప్తికి గురి చేశాయన్న చర్చ సాగింది. సొంత పార్టీకి చెందిన నేత పార్టీ మారుతున్నట్లు సమాచారం అందితే వారితో చర్చించి ఆ ఆలోచన విరమింపజేయాల్సింది పోయి సొంత ప్రచార మాధ్యమాల్లోనే వ్యతిరేకంగా రాయడంపై వారు పెదవి విరుస్తున్నట్లు పార్టీ కార్యకర్తలు పేర్కొంటున్నారు. బుట్టా రేణుక అజ్ఞాతం వీడి అమరావతిలో టిడిపి అధినేత చంద్రబాబును కలిశారు. పార్టీలో చేరకుండా బయటి నుంచి మద్దతు ఇస్తానని ప్రకటించారు. ఆ తర్వాత వైకాపా రేణుక విషయంలో సొంత మీడియాలో ప్రచారం చేయడానికి కారణం కోట్ల సూర్య కోసం కర్నూలు సీటు ఖాళీ చేయించడానికేనంటూ సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం ఎవరు చేస్తున్నారో తెలియకపోయినా కోట్ల సూర్య వంటి సీనియర్ నేత వస్తానంటే ఏ పార్టీ నాయకులైనా సంతోషంగా ఆహ్వానిస్తారని, ఈ విషయంలో బుట్టా రేణుకను ఒప్పించడం అంత కష్టం కాదని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. కేవలం కోట్ల కోసం రేణుకను బయటకు పంపారని జరుగుతున్న ప్రచారం హాస్యాస్పదమని వెల్లడిస్తున్నారు. కాగా వైకాపా మాత్రం కోట్ల సూర్య తమ పార్టీలో చేరడం ఖాయమన్న ధీమాలో ఉండటం విశేషం. అయితే కోట్ల మాత్రం ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం గురించి తెలిసినప్పుడు నవ్వుకోవడం తప్ప తానేమీ చేయలేనంటూ వ్యాఖ్యానించడం గమనార్హం.