ఆంధ్రప్రదేశ్‌

బ్రిటిష్ విధానాలకు స్వస్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), అక్టోబర్ 21: రాష్ట్రంలో పోలీసుల కరకుతనం పోవాలి.. పోలీసుశాఖలో అలనాటి బ్రిటీషు విధానాలకు స్వస్తి పలకాలని రాష్ట్ర డిజిపి నండూరి సాంబశివరావు అన్నారు. మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మార్పు అనేది సహజధర్మమని పదే పదే ఉటంకించిన ఆయన రాష్ట్ర పోలీసులు సేవా దృక్పధంతో ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం తమ వద్ద 7,291 యూనిట్లు రక్తం సిద్ధంగా ఉందని, అత్యవసరమైన వారు అడిగితే ఇస్తామన్నారు. ప్రభుత్వ సహకారంతో తమ శాఖ పోలీసు సంక్షేమానికి పెద్ద పీట వేస్తోందని, ఇదే సమయంలో సామాజిక సేవా బాధ్యతలు కూడా భుజానికెత్తుకుందన్నారు. దీనిలో భాగంగా ఇటు పోలీసింగ్ అమలు చేస్తూనే.. మరోవైపు పాఠశాలల దత్తతకు శ్రీకారం చుట్టామన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా వారం రోజుల పాటు రాష్ట్రంలో అనేక సేవా, సామాజిక కార్యక్రమాలు నిర్వహించామని, ఇదే సమయంలో సరికొత్త నిర్ణయాలు కూడా తీసుకుని ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా ఓపెన్ హౌస్, పోలీసు విధులు, ఆయుధాల వినియోగం, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించామన్నారు. విద్యార్థులకు, పోలీసులకు ఇన్విజుబుల్-విజుబుల్ పోలీసింగ్ అంశంపై నిర్వహించిన పోటీల్లో రాష్టవ్య్రాప్తంగా 52వేల మంది సిబ్బంది నుంచి మంచి సలహాలు వచ్చాయని, వాటిని అమలు చేస్తామన్నారు. ఇక అన్ని జిల్లాల్లోనూ, బెటాలియన్‌న్లలోనూ నిర్వహించిన రక్తదాన శిబిరాల ద్వారా పోలీసు సిబ్బంది 7,291 యూనిట్లు రక్తమిచ్చారన్నారు. ఒక్క 17వ తేదీనే భారీగా రక్తమిచ్చారని, రాష్ట్రంలో ఎవరికైనా అత్యవసర పరిస్ధితుల్లో రక్తం కావాలంటే అడగాలని, ఇవ్వడానికి అన్ని వేళలా సంసిద్ధంగా ఉన్నామన్నారు. ప్రతి జిల్లాలోని ఎస్పీని సంప్రదించవచ్చని సూచించారు. ఇదిలావుండగా రాష్ట్రంలోని 862 పోలీస్టేషన్ల పరిధిలో సుమారు 1000 ప్రభుత్వ పాఠశాలలను పోలీసుశాఖ దత్తత తీసుకుని సామాజిక స్ప్రహ అంశాలతో కూడిన కార్యక్రమాలు, అవగాహన తరగతులు ఈనెల 16వ తేదీ నిర్వహించామని. ఇదేక్రమంలో పాఠశాలలను అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు పక్కా ప్రణాళికను కొద్దిరోజుల్లో అమలు చేస్తామన్నారు. దేశంలోనే అత్యుత్తమ ప్రమాణాలతో రాష్ట్ర పోలీసు శాఖ పని చేస్తోందన్నారు. ప్రధానంగా తీవ్రవాదులు, మావోలను నియంత్రించడంలో గ్రేహౌండ్స్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఈ ఏడాది ఐదుగురు విధుల్లో చనిపోయారని, సంక్షేమానికి ప్రతి ఏటా 15కోట్లు ఖర్చు చేస్తున్నామని, 4కోట్ల 76లక్షలతో 50వేల మందికి వార్షిక వైద్య పరీక్షలు చేయగా.. అందులో 9వేల మందికి అడ్వాన్స్‌డ్ పరీక్షలు చేశారని, వీరిలో 32మందికి అత్యవసర సర్జరీ చేసి ప్రాణాలు నిలబెట్టామన్నారు. పోలీసు సిబ్బంది, అధికారుల సేదతీరేందుకు మూడుకోట్లతో డార్మెటరీల నిర్మాణం జరుగుతోందన్నారు.
పోలీసులనూ ఉపేక్షించం
ఇదిలావుండగా రాష్ట్రంలో అక్కడక్కడ ఇటీవల చోటు చేసుకున్న ఘటనల్లో పోలీసులే నిందితులుగా ఉండటాన్ని ప్రస్తావిస్తూ విశాఖ, నెల్లూరు, కృష్ణాజిల్లాలో డిఎస్పీ, ఎస్‌ఐలపై కేసులు నమోదు చేశారన్నారు. చర్యలకు ఏమాత్రం వెనుకాడబోమన్నారు. పోలీసులమే కదా ఏమీ కాదనే వైఖరితో ఉంటే కష్టమన్నారు. న్యాయం అందరికీ సమానమేనని, ఇప్పటికే డిఎస్పీ రవిబాబు కేసులో విశాఖ సీపి నివేదికకు ఆదేశించామన్నారు. క్రైం రేటులో దేశంలో రాష్ట్రం 12వ స్థానంలో ఉందని, మావోల అణిచివేతలో ప్రణాళికతో ముందుకెళ్తున్నామన్నారు.
బ్యాంకులతో ఎంఓయు
రాష్టవ్య్రాప్తంగా ఎస్‌బిఐ, విజయవాడలో యాక్సిస్ బ్యాంకులు పోలీసుల జీతాలను తమ అకౌంట్లలో జమ చేసేందుకు ముందుకు వచ్చాయన్నారు. ఇందుకు సంబంధించి డిజిపి, బ్యాంకు అధికారులతో ఎంఓయు కుదుర్చుకున్నారు. సిబ్బంది ఖాతాలు బ్యాంకుల వద్ద ఉంటే ఆయా బ్యాంకులు ప్రీమియం లేకుండా 30లక్షలకు ఇన్సూరెన్స్ ఇచ్చేందుకు ముందుకు వచ్చాయన్నారు. సంక్షేమంలో భాగంగా పోలీసుశాఖకు చెందిన 4500 ఎకరాల్లో పిపిపి పద్దతుల్లో ప్రభుత్వం క్వార్టర్లు నిర్మించే ఆలోచన ఉందన్నారు.
ఏఎస్‌ఐ కుటుంబానికి సాయం
రిజర్వు ఏఎస్‌ఐ మృతి చెందడంతో ఆయన కుటుంబానికి యాక్సిస్ బ్యాంకు 20లక్షలు ఇన్సూరెన్స్‌ను చెల్లించింది. ఆగస్టు 10వ తేదీన ఎస్కార్ట్ విధులకు హాజరై విజయవాడ నుంచి మంగళగిరి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో రిజర్వు ఎఎస్‌ఐ ఎంకె దుర్గారావు మృతి చెందారు. ఆ తర్వాత విజయవాడ పోలీసు, యాక్సిస్ బ్యాంకు మధ్య ఆగస్టు 16వ తేదీన కుదిరిన ఓప్పందం మేరకు ముందుకు వచ్చిన బ్యాంకు 20లక్షల చెక్కు అందచేసింది.