ఆంధ్రప్రదేశ్‌

బీచ్ ఫెస్టివల్‌కు సన్నాహాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, అక్టోబర్ 23: కాకినాడ బీచ్ ఫెస్టివల్-2018 నిర్వహణకు ప్రభుత్వ యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. ఈ ఫెస్టివల్‌ను రెండు సంవత్సరాలుగా రాష్టస్థ్రాయి ఉత్సవంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈదఫా కూడా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించడానికి ఏర్పాట్లుచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఇక్కడ బీచ్ ఫ్రంట్ అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన నిర్వహిస్తున్నారు. ఏటా సంక్రాంతి పండుగ (జనవరి)కు ముందు మూడు రోజుల పాటు కాకినాడ బీచ్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నారు. గత ఐదు సంవత్సరాలుగా ఫెస్టివల్‌ను నిర్వహిస్తుండగా, తెలుగుదేశం ప్రభుత్వం కాకినాడ బీచ్‌కు ఎన్టీఆర్ సాగర తీరంగా నామకరణంచేసి, రాష్టస్థ్రాయి ఉత్సవంగా ప్రకటించింది. కాకినాడ తీర ప్రాంతాన్ని పర్యాటకంగా అగ్రభాగాన నిలపడానికి, ఈ ప్రాంతంలో సహజసిద్ధమైన ప్రకృతి ప్రదేశాలకు పర్యాటకంగా ప్రపంచ స్థాయి గుర్తింపును తెచ్చేందుకు బీచ్ ఫెస్టివల్ దోహదపడుతోందని ప్రభుత్వం భావిస్తోంది. వాస్తవానికి కాకినాడ తీరంలో బీచ్ ఫెస్టివల్‌ను ప్రారంభించిన నాటి నుండి ఈ తీరానికి పర్యాటకుల తాకిడి పెరిగింది. ఏటా ఫెస్టివల్ నిర్వహణతో పాటు కాకినాడ-వాకలపూడి తీరంలో సుమారు మూడేళ్ల క్రితం హరిత బీచ్ రిసార్ట్స్‌ను ప్రారంభించారు. దీంతో ఈ ప్రాంతం పర్యాటకంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక్కడికి సమీపంలోని కాకినాడ- ఉప్పాడ మార్గంలో ప్రస్తుతం పెద్దఎత్తున బీచ్ ఫ్రంట్ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం స్వదేశీ దర్శన్ పథకం కింద మంజూరుచేసిన నిధులు సహా రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ విడుదల చేసిన నిధులతో ఇక్కడ శరవేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. కాకినాడ తీరంలో ఆక్వా మెరైన్ పార్క్, కనె్వన్షన్ సెంటర్లను నిర్మిస్తున్నారు. వీటి నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంతం పర్యాటకంగా అనూహ్యంగా అభివృద్ధి సాధించడం తథ్యమని అధికారులు పేర్కొంటున్నారు. అలాగే వచ్చే బీచ్ ఫెస్టివల్ నాటికి కాకినాడ బీచ్‌ను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు ఆయా పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. బీచ్‌తో పాటు కాకినాడ తీరంలో సహజ సిద్ధంగా వెలసిన హోప్ ఐలాండ్, కోరంగి అభయారణ్యాల్లో కూడా బీచ్ ఫెస్టివల్ నాటికి పర్యాటకులకు వివిధ సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కోరంగిలో అభయారణ్యాన్ని, ఇక్కడి మడ అడవుల అందాలను, అరుదైన జంతుజాలం, వృక్షజాతులను వీక్షించే అవకాశం ఉంది. కోరంగి మడ అడవుల మీదుగా అభయారణ్యంలో పర్యటించేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పించారు. అలాగే కోరంగి అభయారణ్యంలో విహరించేందుకు వీలుగా బోటు షికారు సౌకర్యం అందుబాటులో ఉంది. బీచ్ ఫెస్టివల్ సమయంలో పర్యాటకుల తాకిడి అధికంగా ఉండే అవకాశం ఉండటంతో మరిన్ని హంగులు, సౌకర్యాలను సమకూర్చే పనిలో సంబంధిత శాఖల అధికారులున్నారు.