ఆంధ్రప్రదేశ్‌

ఆస్ట్రేలియా చేరుకున్న ‘తరిణి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 23: సముద్ర మార్గాన గ్లోబ్‌ను చుట్టి వచ్చేందుకు నావికా సాగర్ పరిక్రమ పేరుతో ఆరుగురు నేవీ మహిళలతో గత నెల 10న గోవా నుంచి బయల్దేరిన తరిణి నౌక సోమవారం ఆస్ట్రేలియాలోని ప్రిమెంటెల్ పోర్టుకు చేరుకుంది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన తరిణి నౌక లెఫ్ట్‌నెంట్ కమాండర్ వర్టికా జోషి నాయకత్వంలో లెఫ్ట్‌నెంట్ కమాండర్లు ప్రతిభా జమ్వాల్, పి.స్వాతి, లెఫ్ట్‌నెంట్స్ ఎస్.విజయాదేవి, బి.ఐశ్వర్య, పాయల్ గుప్తాతో ఈ నౌక బయల్దేరి వెళ్లింది. సుమారు 4,800 నాటికల్ మైళ్ల దూరం వీరు ప్రయాణించనున్నారు. ఈ నౌక వచ్చే ఏడాది ఏప్రిల్‌లో తిరిగి గోవాకు చేరుకుంటుంది. ప్రిమెంటల్ పోర్టులో అక్కడి నౌకాదళ సిబ్బంది వీరికి ఘన స్వాగతం పలికారు.