ఆంధ్రప్రదేశ్‌

ఆదిశేషునిపై శేషాచలపతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, అక్టోబర్ 23: పవిత్ర నాగులచవితి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ మలయప్పస్వామి తన ఉభయదేవేరులైన శ్రీదేవి, భూదేవిలతో కూడి ఏడు పడగల పెద్దశేష వాహనంపై సోమవారం సాయంత్రం తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులను కనువిందు చేశారు. కాగా దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగులచవితిగా వ్యవహరిస్తారు. శ్రావణ శుద్ధ చతుర్థినాడు కూడా ఈ పండుగను జరుపుకుంటారు. పురాణ ప్రాశస్త్యం ప్రకారం సర్పరాజైన ఆదిశేషు జగన్నాథునికి నివాస భూమిగా, తల్పంగా, సింహాసనంగా, పాదుకలుగా, శయ్యలా, ఛత్రంగా, కామరూపియై వివిధ సందర్భాల్లో వివిధ రకాలుగా స్వామివారికి సేవలందిస్తాడు. అంతేకాకుండా రామావతారంలో లక్ష్మణునిగా, కృష్ణావతారంలో బలరామునిగా స్వామివారికి అత్యంత సన్నిహితునిగా వ్యవహరించే ఆదిశేషువు శ్రీ మహావిష్ణువు సేవకులలో ఆద్యుడు. ఈవిధంగా స్వామివారు దాసభక్తికి మారు రూపంగా నిలిచే తన ప్రియ భక్తుడైన శ్రీ ఆదిశేషువుపై సాక్షాత్కరింఫజేస్తున్నారు.