ఆంధ్రప్రదేశ్‌

బాబూ.. మీ మనసును రిపేర్ చేసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద: అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మంగళవారం నాడు శాసనసభలో అధికార విపక్ష సభ్యుల మధ్య వాడీవేడీ చర్చ జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రకటనను ఎద్దేవా చేస్తూ విపక్ష నేత జగన్మోహన్‌రెడ్డి మాట్లాడారు. మహిళాదినోత్సవం అని చూడకుండా అబద్దాలు చెబుతున్నారని సిఎం ముందు తన మనసును రిపేరు చేసుకోవాలని , తర్వాత పార్టీని, వ్యవస్థను రిపేరు చేయడం మొదలుపెట్టాలని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు కన్నార్పకుండా అబద్ధాలు చెబుతున్న తీరు ఆహా అనిపిస్తోందని జగన్ అన్నారు. అక్క చెల్లెళ్ల ఉన్నతస్థాయి పోరాటం అనే థీమ్‌ను ఐక్యరాజ్యసమితి ప్రకటించిందని, స్ర్తి అంటే తల్లి అని, తల్లి అంటే ఓపికకు చిహ్నమని, అయితే రాష్ట్రంలో నిజంగా మనం మహిళలను గౌరవిస్తున్నామా అని గుండెల మీద చేతులు వేసుకుని ప్రశ్నించుకోవాలని అన్నారు. ఇదే చట్టసభలో తన సోదరి రోజాను నిబంధనలు ఒప్పుకోకపోయినా ఏడాది పాటు అసెంబ్లీ నుండి సస్పెండ్ చేశారని, చట్టసభలు చేసే ఇదే సభలో చట్టాలను ఉల్లంఘిస్తూ ఒక మహిళా ఎమ్మెల్యేను సస్పెండ్ చేసిన ఘనత ఇదే శాసనసభదని అన్నారు. ఇదే రాష్ట్రంలో వనజాక్షి అనే ఎమ్మార్వోను ఇసుక మాఫియాకు అడ్డుతగులుతోందన్న కక్షతో జుట్టుపట్టుకుని ఈడ్చిన శాసనసభ్యుడు ప్రవర్తించిన తీరు హేయమని, ఆ ఎమ్మెల్యే మీద కేసులు కూడా నమోదు కావని, అరెస్టులు లేవని అన్నారు. ఇదే రాష్ట్రంలో అంగన్‌వాడీ కార్మికులను దుర్భాషలాడుతూ తిడితే, ఆ కార్మికులంతా శాసనసభ్యుడికి వ్యతిరేకంగా ధర్నా చేస్తే కనీసం ఆ ఎమ్మెల్యే మీద కేసులు నమోదు కాలేదని, నాగార్జున వర్శిటీలో రిషితేశ్వరి అనే విద్యార్ధి బలవన్మరణానికి పాల్పడితే ప్రిన్సిపాల్‌ను అరెస్టు చేశారని ఇప్పుడు వింటున్నామని, అరెస్టు చేసినంత స్పీడుగానే బెయిల్ ఇచ్చి పంపిస్తున్నారని పేర్కొన్నారు. విజయవాడ వడ్డీ వ్యాపారం పేరిట అధిక వడ్డీలకు డబ్బులిచ్చి, కట్టలేని పరిస్థితిలో ఉన్న పేద అక్కచెల్లెమ్మలను సెక్స్ రాకెట్‌లోకి దింపి, వీడియోలు రికార్డు చేసి, వాటితో బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని, ఈ నేరం చేసింది సాక్షాత్తు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, సిఎం, ఇంటిలిజెన్స్ ఐజితో నిందితులు మాట్లాడుతున్న ఫోటోలు వచ్చినా జైళ్లకు ఎవర్నీ పంపలేదని, కేసులు నామమాత్రంగా పెట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చారని అన్నారు. రాష్ట్రంలో అక్క చెల్లెమ్మల మీద మనం చూపిస్తున్న ప్రేమ ఇదని, ఇదే సభలో కాల్‌మనీ సెక్స్ రాకెట్‌కు సంబంధించిన ఎమ్మెల్యేలు అంతా ఇక్కడే ఉన్నారని వనజాక్షి జుట్టుపట్టుకున్న దుశ్శాసనులూ ఉన్నారని అన్నారు. చివరికి ఒక వ్యక్తి తాగి, ఒక మహిళ వెంటపడి ఆమెను కారులోకి లాగి బలాత్కరించే ప్రయత్నం చేసినపుడు స్థానికులు ఆ వ్యక్తిని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగిస్తే ఆ వ్యక్తి తండ్రి మంత్రిగా ఇక్కడే కొనసాగుతున్నారంటే దారుణమని అన్నారు. తన కొడుకు ఇంతటి దారుణమైన పనిచేస్తే దానిని కూడా జగన్‌మోహన్ రెడ్డి చేసిన కుట్ర అని చెప్పే అన్యాయమైన వ్యవస్థను చూస్తుంటే బాధేస్తోందని, ఇలాంటి వ్యక్తిని మంత్రిగా కొనసాగిస్తున్న ముఖ్యమంత్రిని చూస్తే సిగ్గుతో తలదించుకోవల్సి వస్తోందని జగన్ పేర్కొన్నారు.
ఇదే చట్టసభకు చెందిన మరో ఎమ్మెల్యే ఒక కార్యక్రమంలో మహిళల గురించి చాలా లోకువగా మాట్లాడారని, జాతీయ చానళ్లలో కూడా దానిపై చర్చ జరుగుతోందని, అలాంటి సభ్యుడు ఇదే సభలో ఉన్నాడని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆశా వర్కర్ల ఉద్యోగాలు ఊడగొట్టారని, పెంచిన జీతాలు ఇవ్వమని అడగడమే నేరమంటూ వాళ్లను ఉద్యోగాల్లో నుండి పీకేయండని సర్క్యులర్లు జారీ చేశారని, డ్వాక్రా మహిళలకు చంద్రబాబు 1388 కోట్లు వడ్డీలు కట్టామని అంటున్నారని, ఇదేమైనా కొత్తగా మొదలుపెట్టారా రాజశేఖర రెడ్డి హయాంలో పావలావడ్డీకే రుణాలు ఉండేవి కదా అని జగన్ ప్రశ్నించారు. అంతకుముందు చంద్రబాబు సిఎంగా ఉన్నప్పుడు రుణాలు 12-14 శాతం వడ్డీకి ఇచ్చేవారని, ఎన్నికల ముందు రుణాలు కట్టవద్దని చంద్రబాబు నాయుడు చెప్పడంతో ఆ రుణాలు కట్టకపోవడంతో ఇబ్బందులు వచ్చాయని గుర్తు చేశారు.
ఇపుడు రుణాలు మాఫీ చేస్తున్నామని చెప్పి ఒకొక్కరికీ 3వేల రూపాయిలు పెట్టుబడి నిధిగా ఇచ్చారని, 14,200 కోట్లు మాఫీ చేస్తామన్న పెద్ద మనిషి అధికారంలోకి వచ్చాక అప్పు ఇస్తాను అంటున్నారని పేర్కొన్నారు. డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు వడ్డీ లేని రుణాలు పోయాయని, చంద్రబాబు కట్టొందంటే కట్టని పాపానికి, వాళ్ల దగ్గర రెండు రూపాయిలు వడ్డీ వసూలు చేస్తున్నారని, కేవలం 12.42 శాతం గ్రూపులు మాత్రమే ఎ రేటింగ్‌లో ఉన్నాయని, 52.31 శాతం గ్రేడ్ -డిలో ఉన్నాయని జగన్ వివరించారు. సమానత్వం గురించి చంద్రబాబు ఏదోఏదో మాట్లాడుతున్నారని, కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా అని సిఎం హోదాలో వివక్షాపూరిత వ్యాఖ్యలు చేశారంటూ జగన్ గుర్తు చేశారు. మంత్రి పదవుల్లో ఉన్నామని ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం కాదని మహిళల పట్ల గౌరవంగా ఉన్నామా లేదా అన్నది మనకు మనమే ప్రశ్నించుకోవాలని అన్నారు.

మంగళవారం అసెంబ్లీలో ప్రసంగిస్తున్న జగన్