ఆంధ్రప్రదేశ్‌

రెండో రోజు మహానాడులో 11 తీర్మానాల ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మే 28: తిరుపతిలో జరుగుతున్న టిడిపి మహానాడులో రెండో రోజైన శనివారం 11 తీర్మానాలను ఆమోదించారు. ఇందులో ఎన్ టి ఆర్‌కు భారతరత్న, ప్రజా రాజధానిగా అమరావతి, వౌలిక రంగాల అభివృద్ధి, శాంతి భద్రతల పరిరక్షణ, జాతీయ రాజకీయాల్లో టిడిపి పాత్ర, ఆర్థిక అసమానతలు, పేదరిక నిర్మూలన, పరిశ్రలు, పెట్టుబడులు ఆకర్షణ, సాగునీటి ప్రాజెక్టులు, టి ఆర్ ఎస్ ప్రభుత్వంలో కొరవడిన సామాజిక న్యాయం, తెలంగాణ ప్రభుత్వ అసమగ్ర విధానాలు అనే అంశాలపై తీర్మానాలు చేశారు. కాగా ఈ ఏడాది మహనాడు ఏర్పాట్లుపై నిర్వాహకుల తీరుపట్ల ప్రతినిధులు పెదవి విరిచారు. అయితే వాలంటీర్ల సేవలు మాత్రం బాగున్నాయని కితాబిచ్చారు. మహానాడు ఏర్పాట్లుపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు, సి ఎం చంద్రబాబు నాయుడు ప్రతినిధుల నుంచి అభిప్రాయ సేకరణ చేశారు. వారి అభిప్రాయాలను వేధికపైన బహిరంగంగా వినిపించారు. ఎన్ని కమిటీలున్నాయి, కమిటీలో ఎంతమంది ఉన్నారన్నది ముఖ్యం కాదని, చేసే పనిపట్ల అంకిత భావం లేకుంటే వాటి ఫలాలు ఇలాగే ఉంటాయన్నారు.
ఈ మహానాడులో ఏర్పాటు చేసిన మైక్ సెట్ల పనితీరు చూస్తేనే మీ ఎంత బాధ్యతతో వ్యవహరించారో అర్థమవుతుందని చురకలంటించారు. ఇప్పటికైనా వీటి నుంచి గుణపాఠాలు నేర్చుకుని భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 35వ మహనాడు జరుపుకుంటున్నా ఇంకా పొరబాట్లు జరగడం సబబు కాదన్నారు. ఈక్రమంలో ఒక్కో విభాగంపై ప్రతినిధులు ఇచ్చిన అభిప్రాయాలను ఆయన వెల్లడించారు. ఏర్పాట్లకు సంబందించిన గతేడాది 82.1శాతం బాగుందంటే, ఈసారి 62.54శాతం మాత్రమే బాగుందన్నారన్నారు. అల్పాహారం విషయంలో గతేడాది 75.8, ఈ సారి 68.8, బోజనాలు 77.4, ఈ ఏడాది 65.59, సభా నిర్వహణపై గతేడాది 80.39శాతం బాగుంటుందంటే నేడు 79.3శాతం బాగుందని అభిప్రాయం వచ్చిందన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలకు 75శాతం, ఈసారి 67, అభ్యర్థుల నమోదు గతేడాది 87శాతం, ఈసారి 77శాతం, కార్యకర్తల రవాణాకు గతేడాది 76శాతం, ఈసారి 70శాతం, వసతి సౌకర్యాలకు గతేడాది 79, ఈసారి 63శాతం ఇలా అన్ని విభాగాల్లోను కూడా వెనుకబడి ఉన్నారని ఆయన అన్నారు.
మంత్రి పరిటాల సునీత జన్మదిన వేడుకలు
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత జన్మదిన వేడుకలు మహానాడులో పార్టీ అతిరథ మహారథుల మధ్య శనివారం ఘనంగా జరుపుకున్నారు. ఈసందర్భంగా వేదికపైనే ఆమె కేక్ కట్ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ, పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఆమెకు కేక్‌ను తినిపించారు. ఈసందర్భంగా ఆమె బాబు పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం బాబు మాట్లాడుతూ పరిటాల సునీత అదృష్టవంతురాలని, పార్టీ వ్యవస్థాపకుడు, యుగపురుషుడు ఎన్ టి ఆర్ జన్మదినం రోజే ఆమె జన్మదినం కావడమే అన్నారు.

చిత్రం అశోక్‌గజపతికి స్వీట్ తినిపిస్తున్న సిఎం