ఆంధ్రప్రదేశ్‌

పోర్టుల అభివృద్ధిపై జర్మనీ ఆసక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 31: పోర్టుల అభివృద్ధికి విస్తృ త అవకాశాలు ఉన్నాయని, జర్మనీ సహా పలు దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రి రావెల కిశోర్‌బాబు చెప్పారు. ఐదు రోజుల పర్యటనకు జర్మనీ వెళ్లిన మంత్రి జర్మనీ హాంబర్గ్‌పోర్టును సందర్శించారు. ఈ సందర్భంగా పోర్టు ఎండి హెన్నింగ్ కింగ్ హార్ట్స్, డెన్నిస్ కోగ్ బాన్, డేవిడ్ జాన్ తదితరులు సమావేశమయ్యారు. సన్‌రైజ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ విశిష్టతను మంత్రి పోర్టు అధికారులకు వివరించారు. రాష్ట్రంలో నౌకాయానంలో పెట్టుబడులు విస్తృత పరచడానికి ఉన్న అవకాశాలను జర్మనీ ప్రతినిధులకు మంత్రి వివరించారు. దేశంలో అత్యంత పొడవైన కోస్తాతీరం రాష్ట్రంలో ఉందని, అన్ని రకాల చర్యలు చేపడుతుందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఉన్న వనరులను వినియోగించుకుని జలరవాణాను పెంపొందిస్తే తక్కువ ఖర్చుతో దేశవిదేశాలకు ఎగుమతులు, దిగుమతులు కొనసాగించడం ద్వారా పెద్ద మొత్తంలో ఆదాయం వచ్చే అవకాశం ఉందని అన్నారు.