ఆంధ్రప్రదేశ్‌

రాజకీయం విడగొడితే... భాష మళ్ళీ కలుపుతుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (బెంజిసర్కిల్), మే 31: రాజకీయాలు మనుషులను, ప్రాంతాలను విడగొడితే, భాష ఒక్కటే అందరినీ కలుపుతుందని ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్ నారా లోకేశ్ పేర్కొన్నారు. తెలుగు భాషా ప్రాబల్యం తగ్గుతున్న తరణంలో రాజకీయాలకు, ప్రాంతాలకు అతీతంగా తెలుగు భాషాభివృద్ధికి కృషి చేయాల్సిన సమయం వచ్చిందన్నారు. విజయవాడ సాహితీ సాంస్కృతిక సంస్థలు, ఎన్‌టిఆర్ ట్రస్ట్ సంయుక్తంగా మంగళవారం నగరంలోని శేషసాయి కళ్యాణ మండపంలో తెలుగుభాషా సాంస్కృతిక సమ్మేళనం, మండలి బుద్ధప్రసాద్ షష్ఠిపూర్తి మహోత్సవాలను అట్టహాసంగా నిర్వహించారు. ప్రముఖ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు ఆధ్యక్షతన జరిగిన ముంగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నారా లోకేష్ మాట్లాడుతూ పరిస్థితులకు అనుగుణంగా ఎన్ని సమస్యలు వచ్చినా భాష ద్వారా వాటిని పరిష్కరించుకునే వీలు కలుగుతుందన్నారు. ఈ సమ్మేళనంలో అందరి సూచనలు, సలహాలను నివేదిక రూపంలో పొందుపరిచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబును కలసి విన్నవించనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి పల్లె రఘునాధరెడ్డి మాట్లాడుతూ తెలుగు భాషా పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, మహానుభావుల జయంతి వేడుకలను రాష్ట్ర పండగలుగా నిర్వహిస్తున్నట్లు గుర్తు చేశారు. ప్రభుత్వం ఇప్పటికే సుమారు 50 కోట్ల రూపాయల నిధులను ఇందుకోసం కేటాయించినట్లు ఆయన చెప్పారు. లతిత కళా అకాడమీ, సంగీత అకాడమీ, సాహిత్య అకాడమీలను పునరుద్ధరించనున్నట్లు ఆయన ప్రకటించారు. తుర్లపాటి కుటుంబరావు మాట్లాడుతూ క్షీణ దశకు చెరుకున్న తెలుగు భాషా పరిరక్షణకు అందరూ కృషి చేయాలన్నారు.
కోలాహలంగా తెలుగు భాషా సమ్మేళనం..
తెలుగుభాషా సంస్కృతిక సమ్మేళనం ఎంతో కోలాహలంగా జరిగింది. భాషా కోవిదులు, పండితులు, కవులు, కళాకారులు పాల్గోన్నారు. ముఖ్యంగా రోజు రోజుకీ ప్రాతినిధ్యం కోల్పోతున్న తెలుగు భాషను పరిరక్షించుకుని మున్ముందు తరాలకు మరింతగా అందించేందుకు, సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమంలో సూచనలు, సలహాలను స్వీకరించేందుకు గాను నిర్వహించిన ఈ సమ్మేళంలో రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా దేశ విదేశాలతో పాటు పోరుగు రాష్ట్రాల నుండి కవులు, కళాకారులు, కళాభిమానులు పెద్ద ఎత్తున పాల్గోన్నారు. ఉదయం పది గంటల నుండి రాత్రి పొద్దుపోయేవరకు ఏకబిగిన సాగిన ఈ కార్యక్రమం సాగింది. తెలుగు భాషా పరిరక్షణ, సాంస్కృతిక పరిరక్షణ కోసం అకాడమీలను పునరుద్దరించాని సూచించారు. తెలుగు భాషను డిగ్రీ వరకు తప్పని సరి చేయాలని కూడా సూచించారు. తెలుగు యూనివర్శిటీ 10వ షెడ్యూల్‌లో ఉన్నందున దానిని విడదీసి రాజమండ్రిలో యూనివర్శిటీని త్వరితగతిన ప్రారంభించాలన్నారు.

చిత్రం బుద్ధప్రసాద్ దంపతులను సత్కరిస్తున్న నారా లోకేశ్, మంత్రి పల్లె రఘునాథరెడ్డి తదితరులు