ఆంధ్రప్రదేశ్‌

ఐదేళ్ల బాలికపై లైంగిక వేధింపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్వతీపురం, మే 31: విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణంలోని వివేకానంద కాలనీ సమీపాన గల ఉజిడితల్లి వీధిలో ఐదేళ్ల మైనర్ బాలికపై పక్కనే ఉన్న జనతావీధికి చెందిన 55 ఏళ్ల అన్నాబత్తుల బాబూరావు కొన్నాళ్లుగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్న విషయం వెలుగు చూసింది. చాలారోజుల నుంచి ఇలా లైంగిక వేధింపులకు గురవుతున్నా అవగాహన లేని ఆ అమ్మాయి చివరకు తల్లిదండ్రులకు విషయం తెలియజేసింది. ఈ మేరకు బాలిక తల్లిదండ్రులు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే వ్యక్తి గతంలో కూడా వివేకానంద కాలనీలోని 14 ఏళ్ల బాలికపై అత్యాచార యత్నం చేయగా అప్పట్లో ఏడేళ్ల జైలు శిక్ష కూడా అనుభవించాడని పార్వతీపురం పట్టణ పోలీసులు తెలిపారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని టౌన్ ఎస్‌ఐ సురేంద్ర నాయుడు తెలిపారు.