ఆంధ్రప్రదేశ్‌

సైకిలెక్కిన అశోక్‌రెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 1: ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన వైసిపి ఎమ్మెల్యే ముత్తంశెట్టి అశోక్‌రెడ్డిని చంద్రబాబు తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఒకవైపు వౌలికవసతులు లేక మరోవైపు రాజధాని లేక అష్టకష్టాలలో ఉన్న ఆంధ్రప్రదేశ్ త్వరలోనే కష్టాలను అధిగమించి పురోభివృద్ధి సాధించడం తథ్యమని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్న నాకు రాజకీయాలకు, పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు వైసిపి శాసనసభ్యుడు, ప్రకాశం జిల్లా వైసిపి జిల్లా అధ్యక్షుడు ముత్తంశెట్టి అశోక్‌రెడ్డి టిడిపిలో చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన రాష్ట్ర ప్రగతిని వివరించారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసినట్టే ఆంధ్రాను కూడా అభివృద్ధి చేస్తానని చంద్రబాబు చెప్పారు. ఆధునిక పరిజ్ఞానాన్ని పూర్తిగా అన్ని రంగాల్లో వినియోగించుకుని ప్రభుత్వ పాలనలో పారదర్శకతను తీసుకువచ్చినట్లు చెప్పారు.
chitram..
అశోక్‌రెడ్డిని పార్టీలోకి ఆహ్వానిస్తున్న సీఎం చంద్రబాబు