ఆంధ్రప్రదేశ్‌

రాజధానిలో హౌసింగ్ ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), నవంబర్ 16: రాష్ట్ర రాజధాని అమరావతిలో నిర్మించదలపెట్టిన ప్రభుత్వ నగర హౌసింగ్ ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయడానికి గాను అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఆర్‌డీఎ కమిషనర్ చెరుకూరి శ్రీ్ధర్ పేర్కొన్నారు. ఈసందర్భంగా గురువారం సీఆర్‌డీఎ కార్యాలయంలో ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు తీసుకొన్న నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సమావేశమైన శ్రీ్ధర్ ప్రాజెక్టు నిర్వహణపై పలు సూచనలు చేశారు. ప్యాకేజీ -1లో ఎమ్మెల్యేలు, ఆలిండియా సర్వీస్ అధికారుల నివాసాలను ఎన్‌సీసీ సంస్థ, ప్యాకేజీ -2 లో ఎన్‌జీవోల నివాసాలను ఎల్ అండ్ టీ సంస్థ, ప్యాకేజీ -3లో గజిటెడ్ అధికారులు, క్లాస్ -4 నివాసాలను షాపూర్జీ పల్లోంజీ నిర్మించనున్నాయి. వీటికి సంబంధించిన నిర్మాణ ప్రణాళిక, అవసరమైన మెటీరియల్, నీరు, రోడ్డు, విద్యుత్ సౌకర్యాలపై కమిషనర్ శ్రీ్ధర్ చర్చించగా గ్రావెల్, ఇసుక, మెటల్ అవసరాలను ఆయా సంస్థల ప్రతినిధుల వివరించగా వీటి కేటాయింపులపై తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ అవసరమైన నీటి సరఫరాకు వెంటనే చర్యలు తీసుకోవాలంటూ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించిన కన్‌స్ట్రక్షన్ ప్లాన్‌పై నిర్మాణ సంస్థల ప్రతినిధులతో చర్చించారు. నిర్ణీత కాలంలో ఆయా నిర్మాణాల పూర్తికి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిర్మాణ ప్రణాళికపై సిబ్బందికి పూర్తి అవగాహన కల్పించాలని, ప్రాజెక్టు నిర్మాణ ప్రదేశంలో ఆర్కిటెక్చర్, స్ట్రక్చరల్ తదితర విభాగాల సిబ్బందికి అందుబాటులో ఉండాలని, వారానికోసారి ప్రభుత్వ కాంప్లెక్సు హౌసింగ్ ప్రాజెక్టులపై సమీక్షించనున్నట్టు తెలిపారు. ఎస్‌ఇలు, ఈఈలు ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఈ సమావేశంలో సీఈ ఎంఎ షుకూర్, ఎస్‌ఈ ఎం జక్రయ్య, ధనుంజయ, ప్రాజెక్టు మేనేజర్ దొరబాబు తదితరులు పాల్గొన్నారు.
ప్లాట్ల రిజిస్ట్రేషన్‌పై సమీక్ష
అమరావతి రాజధాని రైతుల ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియపై డెప్యూటీ కలెక్టర్లతో సమీక్షించిన సీఆర్‌డీఎ కమిషనర్ చెరుకూరి శ్రీ్ధర్ ల్యాండ్ అలియనేషన్, రోడ్డు ప్రాజెక్టుల సమస్యలు, పునరావాస కేంద్రాల ప్రగతి, కేపిటల్ సిటీ అసెట్స్ రిజిస్టర్ తయారీ, డీమార్కేటెడ్ విలేజ్ సైట్లు, హాబిటేషన్ల సబ్ డివిజన్,అర్ వన్ జోన్ రికార్డు సబ్ డివిజన్ తదితర అంశాలపై చర్చించారు. జాయింట్ కలెక్టర్ కృతికా శుక్లా, సీఆర్‌డీఏ అదనపు కమిషనర్ బిఎల్ చెన్నకేశవరావు, ఎస్టేట్స్ జాయింట్ డైరెక్టర్ సిహెచ్ మోహనరావు, తదితరులు పాల్గొన్నారు.